English   

నాని థింగ్స్ ఒకే సినిమాలో నాలుగు వేరియేషన్స్ !

Nani to become a teenager again
2019-02-02 09:53:15

న్యాచురల్ స్టార్ నాని ప్ర‌స్తుతం జెర్సీ అనే సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని క్రికెట‌ర్ పాత్ర‌తో పాటు మ‌రో భిన్న‌మైన పాత్రని చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి అంకానికి చేరుకోగా, ఏప్రిల్ 19న ఈ సినిమా విడుద‌ల చేయ‌నున్నారు. ఇక మరోపక్క మనం డైరెక్ట‌ర్ విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాని త‌న 24వ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 19 నుండి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుందని సమాచారం. ఈ సినిమాలో ఇప్పటికే నలుగురు హీరోయిన్స్ ఉంటారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నాని నాలుగు విభిన్న పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. సినిమాలో ఒక మ‌నిషి జీవితంలోని నాలుగు వేర్వేరు ద‌శ‌ల‌ని చూపించ‌నున్నార‌ని అంటున్నారు. అంటే నాని 19 ఏళ్ళ టీనేజ‌ర్‌ గా, 25 ఏళ్ళ కుర్రాడిగాను, 40 ఏళ్ళు, 50 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న మ‌ధ్య వ‌య‌స్కుడిగాను క‌నిపిస్తార‌ట‌. హాలీవుడ్ చిత్రం ది క్యూరియ‌స్ కేస్ ఆఫ్ బెంజ‌మిన్ బ‌ట‌న్ లైన్‌ని బేస్ చేసుకొని విక్ర‌మ్ కుమార్ ఈ సినిమా తీయ‌నున్నాడ‌ట‌. కీర్తి సురేష్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌, మేఘా ఆకాశ్ లు ఇందులో న‌టించ‌నున్నారని వార్తలు రాగా ఇప్పటి వరకూ అయితే ఎవరినీ ఫైనల్ చేయలేదు. మరి ఈ గాసిప్స్ మీద క్లారిటీ ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.

 

More Related Stories