English   

డిజాస్టర్ దిశగా తమిళ అత్తారింటికి దారేది ?

Simbu
2019-02-02 17:21:01

2013లో విడుదలైన అత్తారింటికి దారేది సినిమా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. విడుదలకి ముందే ఈ సినిమాలో చాల భాగం బయటకు వచ్చేయడంతో ఈ సినిమా మీద సానుభూతో లేక ఆ లీక్ అయిన బిట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఓ తెలీదు కానీ సునామీలా కలెక్షన్లు సంపాదించి పెట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సమంత క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచి పవన్ కెరియర్‌లో లాంగ్ రన్‌ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డుల్ని నమోదు చేసింది. ఈ సినిమా సుమారు ఐదేళ్ల తరువాత తాజాగా తమిళంలో ‘రాజవతాన్ వరువేన్’ పేరుతో విడుదలైంది.  పవన్ పాత్రను హీరో శింబు పోషించారు. అలాగే కోలీవుడ్ అగ్ర దర్శకుడు సుందర్ సి. ఈ చిత్రాన్ని తమిళ్‌లో రీమేక్ చేశారు. సమంతా పాత్రలో మేఘా ఆకాశ్, ప్రణీత పాత్రలో కేథరిన్‌ లు హీరోయిన్లుగా నటించారు. అయితే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. విడుదలైన తొలి ఆట నుండే ఫ్లాప్ టాక్‌ను అందుకుని డిజాస్టర్ దిసగాపరుగులు పెడుతోంది. సినిమాని మక్కీకి  మక్కీ దించేయడానికి ప్రయత్నించినా సరిగా వర్కౌట్ కాకో మరేమో కానీ సినిమా నెగటివ్ టాక్ తెచ్చుకుంటోంది.

More Related Stories