English   

హాలీవుడ్‌ కు టాలీవుడ్ కమెడియన్ !

rahul ramakrishna step into hollywood
2019-02-02 10:31:01

సైన్మా అనే షార్ట్ ఫిలింతో అంద‌రి దృష్టిలో ప‌డి ఆ త‌ర్వాత అర్జున్ రెడ్డి చిత్రంతో పాపుల‌ర్ అయిన క‌మెడీయ‌న్ రాహుల్ రామ‌కృష్ణ‌. ఇటీవ‌ల చాల సినిమాల్లో కనిపించి నవ్వులు పూయిస్తున్నాడు. హుషారు చిత్రంతో టాప్ లేపిన ఈ తెలంగాణా గడుగ్గాయి డిఫ‌రెంట్ ఆటిట్యూడ్‌, తెలంగాణా స్లాంగ్తో కొత్త ద‌నం చూపిస్తూ ప్రేక్ష‌కుల‌ని అలరిస్తున్నాడు. అయితే ఈ కుర్ర క‌మెడీయ‌న్ త్వ‌ర‌లో హాలీవుడ్‌కి ప‌రిచ‌యం కానున్నాడ‌ని సమాచారం. సిల్క్ రోడ్ అనే క్రైమ్ థ్రిల్ల‌ర్‌ లో రాహుల్ కీల‌క పాత్ర పోషించ‌నున్నాడని సమాచారం అందుతోంది. ప్ర‌దీప్ క‌ట‌సాని అనే తెలుగు వ్యక్తి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సిల్క్ రోడ్ అనే సినిమాలో ఒక బీటెక్ కంప్లీట్ చేసిన తెలుగు వ్యక్తి అమెరికా వెళ్త ఎలా ఉంటుందనే నేపధ్యంలో ఉంటుంద‌ట‌. అనదరి లాగే అతను తన ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళ్తాడు, అక్కడ ఎలాంటి ఇబ్బందులు ప‌డ‌తాడు, వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా క‌థ‌ అట.  అయితే త్వరలో ఆయన 'మిఠాయి' చిత్రంలో కనిపించనున్నారు.

More Related Stories