English   

నాగశౌర్యతో సుకుమార్ శిష్యుడి సినిమా !

Sukumar, Sharrath Marar team up for Naga Shourya's film
2019-02-02 12:41:44

జనవరిలో సుకుమార్ శిష్యుడి సినిమా ఒకటి ప్రారంభమైన సంగతి తెలిసిందే. సానా బుచ్చిబాబును దర్శకుడిగా, మెగా మేనల్లుడు వైష్ణ‌వ్‌ తేజ్‌ ను హీరోగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇదొక్కటే కాదు గతంలో కుమారి 21 ఎఫ్ ఆ తర్వాత దర్శకుడు లాంటి సినిమాలను కూడా ఆయనే నిర్మించి త‌న నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లో త‌న ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న యంగ్ టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేశాడు. ఇక తాజాగా సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై సుకుమార్, నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్మెంట్ శ‌ర‌త్ మ‌రార్ క‌ల‌యిక‌లో ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రంలో నాగ‌శౌర్య హీరోగా న‌టిస్తున్నారట, సుకుమార్ ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ప‌నిచేస్తున్న కాశీ విశాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నాగశౌర్య, కాశి కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమా స్క్రిప్ట్ సిద్ధమైంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క చివరి దశలో వుంది. కథకు తుది మెరుగులు దిద్దుతున్నారట. ఈ నెలలో పూజా కార్యక్రమాలతో చిత్రాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారని సన్నిహిత వర్గాల సమాచారం. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

 

More Related Stories