English   

మెగా హీరో స‌ర‌స‌న డ‌బ్ స్మాష్ క్వీన్ ..!

mrinalini ravi to romance with varun tej in valmiki movie
2019-02-02 20:14:09

డ‌బ్ స్మాష్‌తో రాత్రికి రాత్రే సెల‌బ్రిటీ స్టేట‌స్ అందుకున్నవారు ఎంద‌రో ఉన్నారు. బిగ్ బాస్ ఫేం దీప్తి సునయన కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే. అయితే డ‌బ్ స్మాష్‌ స్టార్స్ లో కొంతమందికి మాత్రం  అదృష్టం వ‌రించి వెండితెర‌పై క‌నిపించే ఛాన్స్ వస్తుంది. ఈ కోవ‌లో మృణాలినీ రవి కూడా చేరింది. త‌మిళ నాట డ‌బ్ స్మాష్‌తో ప‌లు వీడియోలు చేసిన మ‌ణాలినీ మెగా హీరో వ‌రుణ్ తేజ్ స‌ర‌స‌న జ‌త‌క‌ట్టే ఛాన్స్ అందుకుంద‌ట‌. దీనిపై చిత్ర యూనిట్ త్వ‌ర‌లోనే క్లారిటీ ఇవ్వ‌నుంద‌ని అంటున్నారు. తాజాగా ఎఫ్2 ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మికి చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. త‌మిళంలో సూప‌ర్ హిట్ కొట్టిన ‘జిగ‌ర్తాండ్రా’కు రీమేక్ అయిన ఈ సినిమాలో హీరోయిన్‌గా డబ్‌స్మాష్ సంచలనం, తమిళ అమ్మాయి మృణాలినీ రవిని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలో ఇప్పటికే ఈ అమ్మాయికి ఒకట్రెండు సినిమాల్లో అవకాశాలు కూడా వచ్చాయి. మెగా హీరో సరసనాస్ చాన్స్ కొడితే జాక్ పాట్ కొట్టినట్టే. తెలుగు నేటీవిటికి త‌గ్గట్టుగా స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్న దర్శకుడు హరీష్ శంకర్ అతి త్వరలోనే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.  థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ వాల్మికి సినిమాలో హీరో నాగ శౌర్య కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ముందు వార్తలు వచ్చినా ఆ తర్వాత శ్రీ విష్ణు ఆ పాత్ర పోషించనున్నాడని అన్నారు. మరి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా ఈ కన్ఫ్యూజన్ తగ్గదు.

More Related Stories