English   

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ కానుకగా ఇచ్చిన విజయ్ సేతుపతి !

Vijay Sethupathi’s expensive gift to director
2019-02-02 21:26:08

సక్సెస్ ఇచ్చిన దర్శకులకు హీరోలు, నిర్మాతలు కానుకలు ఇవ్వడం సర్వ సాదారణం. అలాగే గత ఏడాది తనకు '96' వంటి భారీ విజయాన్ని అందించినందుకు గాను దర్శకుడు ప్రేమ్ కుమార్ కి విజయ్ సేతుపతి బుల్లెట్ ను బహుమానంగా ఇచ్చాడట. మూడు లక్షలకు పైగా ఖర్చు చేసి ఎన్ఫీల్డ్ లోనే హై ఎండ్ బైక్ ను కొనుగోలు చేసి - దానిని 0096 అనే నెంబర్ తో రిజిస్ట్రర్ చేయించి మరీ ప్రేమ్ కుమార్ కు విజయ్ సేతుపతి బహుమానంగా ఇచ్చాడట. గత ఏడాది విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన తమిళ సినిమా ‘96’ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులో కూడా రీమేక్ చేసేందుకు దిల్ రాజు సిద్ధమవుతున్నారు. తమిళ్‌ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రేమ్ కుమారే తెలుగులో కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రేమ్‌కుమార్‌కి విజయ్ బైక్ అందజేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలాగే హీరోగా నటిస్తూనే మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుసగా చిత్రాలు చేస్తున్నాడు విజయ్. ఆయన ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ప్రతిష్టాత్మక మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. 

More Related Stories