English   

మరో వివాదానికి సిద్దమా ?

that is mahalakshmi to be in controversy
2019-02-03 15:58:06

ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన సినిమాలలో మణికర్ణిక ఒకటి. ఈ సినిమాకు ముందుగా క్రిష్ దర్శకత్వం వహించటం ఆ తర్వాత ఏవేవో కారణాలను చోపుతూ ఆయన తప్పుకోవడం, ఆ తరువాత ప్రధాన పాత్రధారి కంగనా దర్శకత్వ బాధ్యతలు తీసుకోవటంతో సినిమా టైటిల్స్‌లో దర్శకులుగా కంగనా, క్రిష్‌ పేర్లు కనిపించాయి. అయితే మేజర్‌ పార్ట్ డైరెక్ట్‌ చేసిన తనకే ఎక్కువ క్రెడిట్ దక్కాలంటూ ఇద్దరూ సోషల్ మీడియాలో గొడవపడుతున్నారు. అయితే ఇప్పుడు ఇదే కోవలో త‌మ‌న్నా ద‌టీజ్ మ‌హాల‌క్ష్మీ చిత్రం వివాదాల‌తో హాట్ టాపిక్‌గా నిలుస్తుందా అనే అనుమానాలు రేగుతున్నాయి. ఎందుకంటే ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ దశలో ఉన్న ఈ ద‌టీజ్ మహాల‌క్ష్మీ సినిమాకి మొద‌ట నీల‌కంఠ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ప‌లు కార‌ణాల వ‌ల‌న ప్రాజెక్ట్ మ‌ధ్య‌లోనే ఆయ‌న త‌ప్పుకున్నాడు. మిగ‌తా భాగాన్ని ఆ ఫేం ప్ర‌శాంత్ వర్మ పూర్తి చేసాడు. అయితే సినిమా రిలీజ్ అప్పుడు టైటిల్స్‌లో ద‌ర్శ‌కుడిగా నీల‌కంఠ‌, ప్ర‌శాంత్ విహారి ఇద్ద‌రి పేర్లు వేస్తారా లేదా అనే దానిపై సందిగ్ధత నెల‌కొంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన దట్‌ ఈజ్‌ మహాలక్ష్మీ యూనిట్ పోస్టర్లు, టీజర్‌లను దర్శకుడి పేరు లేకుండానే రిలీజ్ చేసింది. అయితే మరి సినిమా విషయంలో కూడా ఇదే ఫార్ములా ఫాలో అవుతారా లేక ఒక్కరి పేరు వేసి వివాదానికి ఆజ్యం పోస్తారో అనేది వేచి చూడాలి.

 

More Related Stories