English   

అల్లు అర్జున్ హీరోయిన్ తో జోడీ కట్టనున్న విజయ్ దేవరకొండ..

catherine tresa to romance with vijay deverakonda
2019-02-03 09:57:12

విజయ్ దేవరకొండ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈయన డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు క్రాంతిమాధవ్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో సింగరేణి కార్మికుడుగా నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఇప్పటికే బయటికి వచ్చిన స్టిల్స్ చూసి సినిమా ఎలా ఉండబోతుందో అని అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో రాశి కన్నా, ఐశ్వర్య రాజేష్, ఎలిజిబెత్ నటిస్తున్నారు. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ కూడా విజయ్ దేవరకొండకు జోడీగా నటించబోతుంది. సరైనోడు, ఇద్దరమ్మాయిలతో లాంటి సినిమాల్లో అల్లు అర్జున్ తో జోడీ కట్టిన కాథరిన్ తెరెసా ఇప్పుడు విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది. క్రాంతి మాధవ్ సినిమాలో హీరోయిన్ గా కాథరిన్ ఎంపికయింది. త్వరలోనే షూటింగ్ కు రాబోతుంది కేథరిన్ తెరెసా.. ఈ సినిమాతో తెలుగులో మరోసారి తన సత్తా నిరూపించుకోవాలని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమె తమిళంలో నటించిన అత్తారింటికి దారేది రీమేక్ డిజాస్టర్ అయ్యింది. దాంతో అవకాశాలు లేక అందాల ఆరబోతతో నెట్టుకొస్తోంది కాథరిన్ తెరెసా. ఇలాంటి సమయంలో విజయ్ దేవరకొండ సినిమాలో ఆఫర్ రావడంతో గాల్లో గంతులేస్తుంది ఈ ముద్దుగుమ్మ.. మొత్తానికి ఒకే సినిమాలో నలుగురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.

More Related Stories