English   

లవర్స్ డే నాడు...లవర్స్ డే సినిమాతో రెడీ అయిన వింక్ గర్ల్ !

Priya Prakash Varrier's lovers day movie release on feb 14th
2019-02-03 19:11:16

సోషల్ మీడియా సెన్సేషన్ ప్రియా ప్రకాశ్ వారియర్, రోషన్ నటించిన ‘లవర్స్ డే‘ చిత్రం ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు, తమిళ, మలయాళంతోపాటు కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా ఏక కాలంలో విడుదల కానున్నది. మలయాళంలో హ్యాపీ వెడ్డింగ్ లాంటి సినిమాని తెరకెక్కించిన ఒమర్ లులు దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో ఎ. గురురాజ్‌, సి.హెచ్‌.వినోద్‌రెడ్డి సుఖీభ‌వ సినిమాస్ బ్యానర్‌ పై అనువదించి రిలీజ్ చేస్తున్నారు. గత నెల జనవరి 23 తేదీన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న తర్వాత లవర్స్ డే సినిమా మీద అంచనాలు పెరిగాయి.  ఒరు ఆదార్ లవ్ సినిమా గతేడాది జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. అలాగే అప్పట్లో ఆ సినిమాలోని మాణిక్య మలరాయ పూవీ సాంగ్‌  మీద ముస్లిం సంఘాలు నిరసన చేశాయి. ఆ సాంగ్‌ను వెంటనే ఫిల్మ్ నుంచి తొలిగించాలని హైదరాబాద్‌ తో పాటు మరికొన్ని నగరాల్లో కేసులు నమోదు అయ్యాయి. పోలీసులు డైరక్టర్ ఒమర్ లులూకు నోటీసులు జారీ చేశారు. తనపై వస్తున్న ఆరోపణలకు ఆయన వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో డైరక్టర్‌ను పోలీసులు కోరారు. బహుశా ఇలాంటి వివాదాల వలెనే అది ఆలశ్యం అవుతూ వచ్చి ఉండవచ్చు.

 

More Related Stories