English   

మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజాకి స్వర నీరాజనం !

maestro ilayaraja turns  75 music fresh ever
2019-02-03 13:18:04

మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా అంటే తెలియని సంగీత ప్రేమికులు ఉండరరేమో ! మన తాతల తరం నుండి ఆయన తన ప్రస్థానాన్ని సాగిస్తూనే ఉన్నారు. తన సంగీత సారధ్యంలో దాదాపు 1000కు పైగా చలనచిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన ఇళ‌య‌రాజా 75వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ఇళ‌య‌రాజా 75 అనే కార్య‌క్ర‌మాన్ని గ్రాండ్‌గా ఏర్పాటు చేసి ఆయనని సన్మానించింది. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు, చెన్నై నందనంలోని వైఎంసీఏ మైదానంలో బ్రహ్మాండమైన సంగీత విభావరిని ఏర్పాటు చేసారు. అందులో భాగంగా శనివారం సాయంత్రం జరిగిన ఈ సంగీత కార్యక్రమానికి తమిళనాడు గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఇళ‌య‌రాజాకి ఘ‌న స‌త్కారం చేసిన త‌ర్వాత ఏఆర్ రెహ‌మాన్, విశాల్‌, బ‌న్వ‌ర్ లాల్ త‌దిత‌రులు ఆయన గురించి కాసేపు మాట్లాడారు. సినీ పరిశ్రమ తరఫున ఇళయరాజాకు బంగారంతో చేసిన వయోలిన్‌ను బ‌హుక‌రించారు నిర్మాతల మండలి చైర్మన్ విశాల్. ఇక ఆ వేదిక మీద నుండి ఇళ‌య‌రాజా, ఏఆర్ రెహ‌మాన్‌లు క‌లిసి స్వ‌ర‌పర‌చిన సంగీతానికి అక్కడున్నవారు మంత్ర‌ముగ్ధుల‌య్యారు.

More Related Stories