English   

పేరు మార్చుకుంటున్న నిఖిల్ సినిమా ?

nikhils mudra movie title be changed
2019-02-03 20:35:14

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా తెరకెక్కుతోన్న ముద్ర సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇదే పేరుతో జగపతిబాబు హీరోగా నత్తి కుమార్ నిర్మాతగా మరో సినిమా రావడం, నిఖిల్ ముద్ర పోస్టర్లతో సినీ బుకింగ్ యాప్‌లలో ఆ టిక్కెట్లను విక్రయించడం వివాదాస్పదమైంది. తన పేరు, చిత్ర లోగో, పోస్టర్లను వాడుకుని సినిమా టిక్కెట్లను అమ్ముకున్నారని ఆ సినిమా టిక్కెట్లు కొని వెళ్ళవద్దని నిఖిల్ కోరారు.  ఆ తర్వాత నట్టికుమార్ నిఖిల్‌ మీద ఫైర్ అవ్వడం, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం జరిగి పోయాయి. అయితే ఈ వివాదం కారణంగా తమకి ఇబ్బంది కలగాకూడదని భావిస్తోన్న నిఖిల్ ఇప్పుడు టైటిల్‌ను మార్చుకునే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. నిఖిల్ హీరోగా వస్తోన్న ఈ సినిమా తమిళ చిత్రం ‘కనితన్’కి రీమేక్. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ అర్జున్ లెనిన్ గా కనిపించనున్నారు. నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తోంది. తమిళంలో దర్శకత్వం వహించిన సంతోష్ తెలుగులోనూ తెరకెక్కిస్తున్నారు.  ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వివాదంలో చిక్కుకోవడంతో  మళ్లీ ఆ వివాదం నుంచి బయటికి తీసుకొచ్చి ప్రేక్షకుల్లో దీనిపై ఆసక్తి కలిగేలా చేయాలని యూనిట్ భావిస్తోంది. అందుకే టైటిల్‌ను కూడా మార్చాలని భావిస్తున్నారని టాక్. 

More Related Stories