English   

సుకుమార్ అన్నంత పని చేస్తున్నాడు కదా..

Sukumar, Sharrath Marar team up for Naga Shourya's upcoming film
2019-02-03 14:45:37

నాకు దర్శకత్వంపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు.. ఒక మూడేళ్ల తర్వాత సినిమాలు మానేస్తాను.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు సంచలన దర్శకుడు సుకుమార్. కుమారి 21 ఎఫ్ సినిమా తర్వాత ఓ ఇంటర్వూలో సుకుమార్ ఇలా అన్నాడు. దాంతో అభిమానులు కూడా షాక్ అయ్యారు. అయితే అన్నట్లుగానే దర్శకత్వంలో తక్కువ సినిమాలు చేస్తూ.. నిర్మాతగా ఎక్కువ సినిమాలు చేస్తున్నాడు ఈ దర్శకుడు. తాజాగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై వరస సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే సాయిధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి సంయుక్తంగా ఒక సినిమాను నిర్మిస్తున్నాడు సుకుమార్. ఇక ఇప్పుడు మరో సినిమాను కూడా మొదలు పెట్టబోతున్నారు ఈ దర్శకుడు. పవన్ కళ్యాణ్ తో కాటమరాయుడు, సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాను నిర్మించిన నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ శరత్ మరార్ తో కలిసి నాగశౌర్య హీరోగా ఒక సినిమా నిర్మించబోతున్నాడు సుకుమార్. ఈ చిత్రానికి సుకుమార్ దగ్గర చాలా కాలంగా అసిస్టెంట్ గా పనిచేస్తున్న కాశీ విశాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈయన చెప్పిన కథ నచ్చడంతో తను సొంతంగా నిర్మిస్తున్నాడు సుకుమార్. ఈ రెండు సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు కూడా ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇకపై వరుసగా తను నిర్మాణంలో సినిమాలు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు సుకుమార్. ప్రస్తుత ఈయన మహేష్ బాబు హీరోగా ఒక సినిమా తెరకెక్కించబోతున్నాడు. మార్చి నుంచి షూటింగ్ మొదలు కానుంది. అడవి నేపథ్యంలో సాగే కథతో మహేష్ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. మొత్తానికి అటు దర్శకుడిగా నిర్మాతగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నాడు సుకుమార్.

More Related Stories