English   

నేనే ముఖ్యమంత్రి జగన్ మీదేనా ?

nene mukyamanmantri movie  release on feb 8th
2019-02-03 15:11:47

“నేనే ముఖ్యమంత్రి” పేరుతో విడుదల అవుతున్న ఒక సినిమా పూర్తిగా ఏపీ రాజకీయాలను బేస్ చేసుకోనే రూపొందుతున్నట్లు చెబుతున్నారు. అయితే సమకాలీన రాజకేయలను బేస్ చేసుకుని తెలుగులో చాలా సినిమాలు వచ్చినా ఎక్కడా పెద్దగా ఎవరినీ ఉద్దేశించి తీసినట్టు కనిపించలేదు. అయితే ఈ సినిమా పోస్టర్లు, పాటలు చూస్తుంటే ఎపీ ప్రతిపక్ష నేత జగన్ ను టార్గెట్ చేసినట్లు భావిస్తున్నారు విశ్లేషకులు. అదీ కాక ఈ సినిమా వైయస్సార్ “యాత్ర” విడుదలవుతున్న రోజునే విడుదల కావటం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తూ ఉంది. దీని దర్శకుడు మోహన్ రావిపాటి తెదేపాలో యాక్టివ్ మెంబర్ కావడం, ఇందులో ఉన్న ముఖ్య పాత్రల హావభావాలు అన్నీ జగన్ ని, చంద్రబాబుని, పవన్ ని గుర్తు చేసేలా ఉండటం తో ఈ సినిమా ఖచ్చితంగా జగన్ ని టార్గెట్ చేసినట్లు అంటున్నారు. ప్రోమోలలో వస్తున్న వచ్చే ముప్పై ఏళ్ళు ఆ కుర్చీ నాదే లాంటి డైలాగ్స్ వింటుంటే ఇది ఖచ్చితంగా తెదేపా ప్రయోజనం చేకూర్చేలా రూపోందినట్లు అనిపిస్తుంది. కానీ సెన్సార్ వాళ్ళు మాత్రం ఈ సినిమా గురించి ఏమీ స్పందించలేదు.

More Related Stories