English   

ఫ్లాప్ దర్శకులకు ఆపద్బంధు పథకం పెట్టిన నాని..

Nani
2019-02-04 03:44:03

ఒక్కసారి ప్లాప్ దర్శకుడితో పని చేయాలంటేనే బాబోయ్ అంటారు మన హీరోలు. కానీ నాచురల్ స్టార్ నాని మాత్రం వరుసగా వాళ్లకే అవకాశాలు ఇస్తున్నాడు. ఒకరు ఇద్దరు కాదు గత కొన్నేళ్లుగా ఫ్లాప్ దర్శకులతో సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికీ ఇది కంటిన్యూ చేస్తున్నాడు నాని. ప్రస్తుతం ఈయన నటిస్తున్న జెర్సీ సినిమాకు కూడా ఫ్లాప్ దర్శకుడే పని చేస్తున్నాడు. మళ్ళీరావా సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న గౌతమ్ తిన్ననూరి జెర్సీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంతో పాటు ఇప్పుడు నాని కమిట్ అయిన సినిమాలు కూడా ఫ్లాప్ దర్శకులతోనే. ఫిబ్రవరిలోనే విక్రమ్ కె.కుమార్ సినిమాతో బిజీ కానున్నాడు నాచురల్ స్టార్. గత కొంతకాలంగా విక్రమ్ కె కుమార్ కు విజయాలు లేవు. మనం సినిమా తర్వాత విక్రమ్ తెరకెక్కించిన 24, హలో సినిమాలు అంచనాలు అందుకోలేదు. ఇలాంటి టైమ్ లో నాని ఈ దర్శకుడితో పని చేయబోతున్నాడు. ఇక ఈయనతో పాటు తాజాగా మారుతి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ లో నాలుగేళ్ల కింద వచ్చిన భలే భలే మగాడివోయ్ సినిమా సంచలనం సృష్టించింది. నాని కెరీర్ కు ఊపిరి పోసిన సినిమా ఇది. అదే నమ్మకంతో ఇప్పుడు మారుతి చెప్పిన కథ నచ్చి మరోసారి ఆయనతో పని చేయడానికి నాని సిద్ధమవుతున్నాడని తెలుస్తుంది. గీత ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. మొత్తానికి ప్రస్తుతం వరుసగా ఫ్లాప్ దర్శకులతోనే పనిచేస్తూ ఆపద్బంధు పథకం పెట్టాడు నాచురల్ స్టార్.

More Related Stories