English   

రామ్ చరణ్ దారిలో వెళ్తున్న అఖిల్ అక్కినేని..

Akhil
2019-02-04 11:06:38

హిట్ కొట్టాలంటే ఏదో ఒకటి చేయాలి.. ఇప్పుడు అఖిల్ కు మరో ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే ఈయన నటించిన మూడు సినిమాలు కూడా డిజాస్టర్ అయిపోయాయి. దాంతో కచ్చితంగా ఇప్పుడు నిలబడాలంటే విజయం సాధించాల్సిందే. వెనక ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా ఇక్కడ విజయం లేకపోతే ప్రేక్షకులు చూడరు.. పట్టించుకోరు. దాంతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఆరాటపడుతున్నాడు అక్కినేని అఖిల్. మిస్టర్ మజ్ను సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మినా కూడా ఈ సినిమా కూడా అంచనాలు అందుకోకపోవడంతో ఇప్పుడు ఎలాంటి సినిమా చేయాలా అనే ఆలోచనలో పడిపోయాడు అఖిల్. దానికి సమాధానంగా క్రిష్ పేరు వినిపిస్తుంది. అక్కినేని వారసుడి కోసం ఈయన పునర్జన్మల నేపథ్యంలో ఓ కథ సిద్ధం చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పట్లో చిరుత సినిమా తర్వాత రెండో ప్రయత్నంగా రాజమౌళి పునర్జన్మ నేపథ్యంలో రామ్ చరణ్ హీరోగా మగధీర సినిమా తెరకెక్కించాడు. మెగా వారసుడు సూపర్ స్టార్ గా మారడంలో మగధీర పాత్ర ఎంతో కీలకం. ఇప్పుడు ఇదే దారిలో అఖిల్ కూడా వెళ్తున్నాడు. అప్పుడు రామ్ చరణ్ ఎలా అయితే పునర్జన్మల నేపథ్యంలో హిట్టు కొట్టాడో ఇప్పుడు తాను కూడా అదే చేయాలని చూస్తున్నాడు అక్కినేని వారసుడు. దానికి తోడు అక్కినేని కుటుంబానికి పునర్జన్మల కథలు బాగా కలిసొచ్చాయి. నాగేశ్వరావు నటించిన నటించిన మూగమనసులు.. నాగార్జున నటించిన జానకి రాముడు.. మనం లాంటి సినిమాలు సంచలన విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే నమ్మకంతో అఖిల్ కూడా పునర్జన్మ నేపథ్యంలో హిట్టు కొట్టి తన స్టామినా నిరూపించుకోవాలని చూస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పూర్తి క్లారిటీ రానుంది.

More Related Stories