English   

తమన్నా పెళ్లిని ఆపేసిన వెంకటేష్ !

Tamannaah
2019-02-04 04:27:05

టాలీవుడ్ లో ఒకానొక సమయంలో అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మిల్క్ బ్యూటీ తమన్నా దశాబ్ధం పైగా కెరియర్ కొనసాగిస్తూ తన సత్తా చాటుతుంది. మంచు మనోజ్ సరసన శ్రీ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెర మీద ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత కొద్దిపాటి గ్యాప్ ఇచ్చి మళ్లీ హ్యాపీడేస్ సినిమాతో రీ ఎంట్రీ అదరగొట్టింది. అప్పటి నుండి దాదాపు స్టార్ హీరోలందరితో నటించి మెప్పించిన తమన్నా బాహుబలి లాంటి ప్రేస్టేజియస్ మూవీలో నటించినా పెద్దగా పేరు రాలేదు. అయితే ఈ భామకు ప్రస్తుతం సరైన సినిమా అవకాశాలు లేకపోవడంతో తన కెరీర్ లో ఇక నటనకి గుడ్ బై చెప్తుందేమో అని కొంత మంది గుసగుసలాడుకుంటున్న సమయంలో అనుకోని విజయం ఆమె ఖాతాలో పడి ఆమె కెరియర్ ను మళ్ళీ ట్రాక్ లో పడేసింది. f2 కి ముందు సరైన సినీ అవకాశాలు లేకపోవడంతో ఈ భామ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయింది. కానీ ఎఫ్ -2 సక్సెస్ తో తమన్నా తన నిర్ణయాన్ని మార్చేసుకుందట. మీ పెళ్లప్పుడని మీడియా వాళ్ళు అడిగితే నా వయసింకా 29దే అప్పుడే పెళ్లేంటీ అంటోంది. ఈమె ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తోంది. ఎఫ్ 2 సినిమా దెబ్బకి మరో ఐదేళ్ల వరకూ పెళ్లి ఊసే లేదని చెప్పేసింది. అంటే ఒకరకంగా వెంకటేష్ ఆమె పెళ్లిని ఆపేసినట్టేగా. 
 

More Related Stories