English   

యాంకర్ రవికి జనాలు ఒక మాదిరిగా కూడా ఆనట్లేదా ?

Anchor-Ravi
2019-02-04 11:49:22

తెలుగు బుల్లితెర మీద ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న మేల్ యాంకర్స్‌ ప్రదీప్, రవిలు. ప్రత్యేకించి పటాస్ షో ద్వారా రవి చాలా పాపులారిటీ సంపాదించాడు. అప్పట్లో సీనియర్ నటుడు చలపతిరావు ఆడవాళ్లను ఉద్దేశించి ఓ పిచ్చికూత కూసినప్పుడు, తనను సపోర్టు చేశాడంటూ మహిళసంఘాలు రవిపై కేసు పెట్టాయి. ఆ విషయం పక్కన పెడితే రవి ఎప్పుడూ వార్తల్లో ఉండేది కో యాంకర్స్ లాస్య, శ్రీముఖిలతో తన సంబంధాల పై మీదే ఎందుకంటే ఆయన వాళ్ళతో అలాంటి రాపో మెయింటెయిన్ చేసేవాడు మరి.  అయితే లాస్య ప్రోగ్రామ్‌లలో యాంకర్‌ రవితో చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆన్ స్క్రీన్ మీద వారి సాన్నిహిత్యం చూసి వారు నిజజీవిత ప్రేమికులని అనుకున్నారు. అయితే రవికి అంతకుముందే పెళ్లిపోయిందనే విషయం చాలా మందికి తెలియదని అప్పట్లో లాస్య చెప్పుకొచ్చింది. అయినా ఒక వ్యక్తి నాతో ఎన్నో ప్రోగ్రామ్‌లు చేశాడని అతనికి అప్పటికే పెళ్లయిపోయిందని, కానీ నాకు కూడా ఓ లవర్‌ ఉన్నాడని అతనికి తెలిసి కూడా అతను నాకు ప్రపోజ్‌ చేశాడని లాస్య అప్పట్లో బాంబు పేల్చింది. అయితే ఆ వ్యక్తి పేరు మాత్రం చెప్పలేదు. కానీ తనకు పెళ్లి కాలేదని రవి ఓ ఇంటర్వ్యూలో బుకాయించాడు. “నాకు పెళ్లి కాలేదని నిరూపిస్తే మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా?” అని ఇంటర్వ్యూ చేసిన యాంక‌ర్‌ని ఎదురు ప్రశ్నించడంతో అందరూ నిజమే అనుకుని ఇలాంటి అలగేషన్స్ చేసినందుకు లాస్యని తిట్టుకున్నారు.  కానీ నిన్న ‘విజయవంతమైన మనిషి కంటే పెళ్లైన మనిషి చాలా సంతోషంగా వుంటాడని ఒక పోస్ట్ పెట్టి తన భార్య పాపా ఫోటో పోస్ట్ చేశాడు రవి. తనకు పెళ్లైందని, మూడేళ్ల పాప వుందని ఇన్నాళ్లూ రహస్యంగా దాచిన నిజాన్ని ఆయన బట్టబయలు చేసాడు. అయితే అప్పట్లో లాస్య కామెంట్స్ తన గురించి కాదనే వాదాన్ని చెప్పుకోడానికే ఆయన ఆలా చెప్పాడని ఇప్పుడు ఆ విషయం జనాలకు పెద్దగా గుర్తుండదు కాబట్టి పోస్ట్ చేసి ఉంటాడని అంటున్నారు. యాంకర్ రవికి జనాలు ఒక మాదిరిగా కూడా ఆనట్లేదా ? అని సోషల్ మీడియాలో ఆడుకుంటున్నారు. ఆయన మాట్లాడిన వీడియో మీరూ చుడండి .

More Related Stories