English   

సైరాలో సర్ ప్రైజ్.. చిరంజీవితో పాటు మరో ఇద్దరు హీరోలు..

Sye-Raa
2019-02-04 07:10:07

తెలుగు ఇండస్ట్రీలో అతిపెద్ద మల్టీస్టారర్ సినిమాల్లో ఒకటిగా నిలిచిపోతుంది సైరా నరసింహారెడ్డి. ఇప్పటికే ఈ చిత్రంలో చిరంజీవితో పాటు ఇంకా చాలా మంది హీరోలు నటిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్.. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి.. కన్నడ సూపర్ స్టార్ సుదీప్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. వాళ్లతో పాటు జగపతిబాబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. నయనతార, తమన్నా కూడా ఉన్నారు. ఇంత మంది ఉన్న ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు ఇండియన్ సినిమా ఆడియన్స్ కూడా వేచి చూస్తున్నారు. దానికితోడు బాహుబలి తర్వాత తెలుగు సినిమాపై బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను హాలీవుడ్ స్థాయికి తగ్గట్లుగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సురేందర్ రెడ్డి. సైరా సినిమాను దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో ఇద్దరు మెగా హీరోలు కూడా నటించబోతున్నారనే వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వాలని ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో ఇద్దరు రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అనుష్క కూడా ఈ చిత్రంలో నటిస్తోందని కొత్త ప్రచారం జరుగుతుంది. మొత్తానికి సైరా నరసింహారెడ్డి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.

More Related Stories