English   

తారకరత్న రెస్టారెంట్ ని పడకొట్టిన జీహెచ్ఎంసీ !

Tarak-Ratna
2019-02-04 15:33:14

బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో సినీనటుడు తారక రత్న నిర్వహిస్తున్న కబరా డ్రైవ్ ఇన్ రెస్టారెంటును కూల్చేందుకు అధికారులు యత్నించారు. ఈ సందర్భంగా అధికారులతో రెస్టారెంట్ సిబ్బంది వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న తారకరత్న హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న ఆయన తమకు కొంత సమయం ఇవ్వాలని అధికారులను కోరగా తారకరత్న విన్నపం మేరకు జీహెచ్ఎంసీ అధికారులు మూడు గంటల గడువు ఇచ్చారు. గడువులోగా రెస్టారెంట్‌లోని సామగ్రిని అక్కడి నుంచి తరలించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. డ్రైవ్‌ఇన్ రెస్టారెంట్‌ ను నిబంధనలకు విరుద్ధంగా రెసిడెన్షియల్ ఏరియాలో నడుపుతున్నారని, రాత్రి వేళల్లో మద్యం తాగుతూ, డీజే సౌండ్స్‌తో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కాలనీలోని సొసైటీ సభ్యులు జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఒకప్పుడు హీరోగా బిజీగా ఉన్న తారకరత్న ఆ తర్వాత సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చారు. గతేడాది అది కూడా లేదు, ఇక తాజాగా ఆయన చిరంజీవి మొదటి సినిమా పేరు ప్రాణం ఖరీదు పేరుతో వస్త్తున్న సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకి సిద్దంగా ఉంది.

More Related Stories