English   

ముద్ర మారింది....అర్జున్ సురవరం అయిన నిఖిల్ !

Nikhil
2019-02-04 16:06:43

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా టీఎన్ సంతోష్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందింది. ఈ సినిమాకి ముందు 'ముద్ర' అనే టైటిల్ అనుకున్నారు. అయితే టైటిల్ లోగోతో పోస్టర్ కూడా విడుదల చేశారు. అయితే ఈ టైటిలే వివాదాన్ని తెచ్చిపెట్టింది. ఇదే పేరుతో జగపతిబాబు హీరోగా ముద్ర పేరుతో మరో సినిమా రావడం ముద్ర లోగోతోనే బుకింగ్ యాప్‌లలో ఆ చిత్రం టిక్కెట్లను విక్రయించడం వివాదాస్పదమైంది. తన పేరు, చిత్ర లోగో, పోస్టర్లను వాడుకుని ‘ముద్ర’ సినిమా టిక్కెట్లను అమ్ముకున్నారని నిఖిల్ ఆరోపిస్తూ అది తన సినిమా కాదని, ఆ సినిమాకి ఎవరూ వెళ్ళద్దని ప్రకటించారు. అయితే జగపతిబాబు ముద్ర సినిమాకు నిర్మాత నట్టి కుమార్ నిఖిల్‌ మీద ఫైర్ అవ్వడం, ప్రూఫ్ లు ఉంటే చూపాలని లేదా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం తెలిసిందే. ఈ వివాదం కారణంగా తమ సినిమా టైటిల్ మార్చాలని హీరో నిఖిల్, దర్శకనిర్మాతలు నిర్ణయించారు. మార్చిన టైటిల్‌తో సోమవారం చిత్ర పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలోని హీరో పేరునే టైటిల్‌గా పెట్టారు. ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్టు అర్జున్ లెనిన్ సురవరంగా కనిపించనున్నారు. ఆ పేరులోని ‘అర్జున్ సురవరం’ను చిత్ర టైటిల్‌గా ఫిక్స్ చేశారు. తమిళ సూపర్ హిట్ మూవీ ‘కనితన్’కి రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమాని తమిళ డైరెక్టరే ఈ సినిమాని తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్నారు. 

More Related Stories