English   

ఆ ముద్దుల దర్శకుడితో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నాడా..

Vijay-devarakonda
2019-02-04 18:00:00

ముద్దుల దర్శకుడు ఏంటి అనుకుంటున్నారా.. ఈ మధ్య కాలంలో మన దర్శకులకు ముద్దుల పిచ్చి పట్టుకుంది. కొందరు దర్శకులు తమ సినిమాల్లో బాలీవుడ్ రేంజ్ లో ముద్దులు పెట్టించేస్తున్నారు. అలాంటి దర్శకుడు శ్రీ హర్ష కొనగంటి. గతేడాది ఈయన తెరకెక్కించిన హుషారు సినిమా మంచి విజయం సాధించింది. ఈ చిత్రంతోనే ఆయన దర్శకుడిగా మారాడు. ఇందులో ఎమోషనల్ కంటెంట్తో పాటు అడల్ట్ కంటెంట్ కూడా ఉంది. సినిమాలో చాలా ముద్దులు ఉన్నాయి. అప్పుడప్పుడు హద్దులు కూడా దాటారు. అయితే ఏం చేసినా కూడా యూత్ ఎంటర్టైనర్ కావడంతో హుషారు మంచి కలెక్షన్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు ఈ దర్శకుడు తన రెండో సినిమా కోసం ఏకంగా విజయ్ దేవరకొండను లైన్ లో పెట్టాలని అని చూస్తున్నాడు. ఈయన కోసం ఓ కథ సిద్ధం చేసి త్వరలోనే ఆయనకు వినిపించడానికి సిద్ధమవుతున్నాడు శ్రీహర్ష. అయితే ఈ కుర్ర దర్శకుడు ఊహించినంత ఈజీ కాదు ఇప్పుడు విజయ్ దేవరకొండ తో సినిమా చేయడం అంటే. ప్రస్తుతం విజయ్ దేవరకొండ దాదాపు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో రెండు సెట్స్ పై ఉన్నాయి.. మరో రెండు సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఆయనకు కథ చెప్పి పంపించడం చిన్న విషయం కాదు. డియర్ కామ్రేడ్.. క్రాంతి మాధవ్ సినిమా.. వెంకీ అట్లూరితో సినిమా పూర్తయిన తర్వాత గానీ విజయ్ దేవరకొండ మరో సినిమాపై దృష్టి పెట్టడు. మరి అప్పటి వరకు శ్రీహర్ష.. విజయ్ దేవరకొండ కోసం వేచి చూస్తాడా లేదా అనేది చూడాలి..

More Related Stories