English   

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మీద పడ్డ నాగబాబు !

Naga-Babu
2019-02-04 19:00:38

మొన్నటి వరకూ పొలిటికల్ సెటైర్స్‌ తో బాలయ్య, జగన్, లోకేష్, బాబుల మీద అంతా నా ఇష్టం అంటూ లాజిక్ లెస్  వీడియోలు విడుదల చేసిన నాగబాబు తాజాగా లెజెండరీ సింగర్ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం మీద డైరెక్ట్ ఎటాక్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఇటీవల హీరోయిన్స్ వస్త్రధారణపై బాలసుబ్రహ్మణ్యం చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇస్తూ ఆయన పేరును మాత్రం ప్రస్తావించకుండా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యన కొందరు మహానుభావులు, పెద్దవాళ్లు, గౌరవనీయులైన వ్యక్తులు పేర్లు కూడా ఉచ్చరించడం ఇష్టం లేదని తెలుగు ఇండస్ట్రీలో అత్యంత ప్రముఖుడైనటువంటి సంగీత సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన ఆ మహానుభావుడు ఆడవాళ్ల డ్రెస్సింగ్ సెన్స్ మీద మాట్లాడారని ఆయనతో పాటు ప్రవచనాలు చెప్పే మరో వ్యక్తి, మరో నటుడు పార్లమెంట్‌లో ఆడవాళ్ల వస్త్రధారణపై మాట్లాడారని ఆడవాళ్లు సాంప్రదాయంగా డ్రెస్‌లు వేసుకోవాలంటారని, శరీరాన్ని ఎక్స్‌పోజ్ చేస్తూ డ్రెస్‌లు వేసుకోకూడదని దానివల్ల మగవాళ్ల దృష్టి ఆడవాళ్ల మీద పడి అత్యాచారాలకు కారణం అవుతుంది, కాబట్టి కొంచెం సాంప్రదాయబద్ధంగా శరీరాన్ని కప్పుకునే విధంగా బట్టలు వేసుకోమని చెప్తున్నారని అన్నారు. 

అయితే అసలు ఒక ఆడపిల్ల గురించి ఆడవాళ్ల డ్రెస్‌లు ఇలా వేసుకోవాలని చెప్పడానికి మీరెవరు? మీకు ఎవరు అధికారం ఇచ్చారని అయన ప్రశ్నించారు. సాంప్రదాయం, మతం ముసుగుతో ఆడపిల్లలు ఇలాంటి డ్రెస్‌లు వేసుకోకూడదని, అలాంటి డ్రెస్‌ల వల్లే మగవాళ్ల కోరికలు పెరుగుతున్నాయి అనడం తప్పని అన్నారు. నాకు తెలిసినంతవరకూ అత్యాచారాలు చాలా వరకూ ఒళ్లంతా కప్పుకున్న వాళ్లపైనే జరిగాయని ఆయన పేర్కొన్నారు. అలాగే హీరోయిన్లు పొట్టి డ్రెస్లు వేసుకుని క్యారెక్టర్ల కోసం ఎట్రాక్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా అసలు మీ దృష్టి వాళ్ల డ్రెస్ మీదికి ఎందుకు వెళ్తుంది ? మీ కళ్లు ఆమె డ్రెస్‌‌ని ఎందుకు చూస్తున్నాయని ? ముందు మీ వక్రబుద్ధి మార్చుకోండని ఆయన సలహా ఇచ్చారు. మీరు చూసేదంతా చూసేని చప్పరించేసి తరువాత స్టేజ్‌ల మీదికొచ్చి కబుర్లు చెప్తారని చెప్పుకొచ్చారు. అయతే మంచి బట్టలు వేసుకోమనడం కూడా తప్పేనా నాగబాబు అంటూ నెటిజన్లు ఓరేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. మరోపక్క తల్లి చనిపోయి బాధలో ఉన్న ఆయన మీద కామెంట్స్ ఎలా చేస్తున్నారు అంటూ నాగబాబు మీద విరుచుకుపడుతున్నారు బాలు గారి అభిమానులు. నాగబాబు ఇలా మాట్లాడటం పట్ల వారి కార్యక్రమ యాంకర్ రష్మి హ్యాపీగా ఫీల్ అవుతోంది. వేసుకునే దుస్తులకు మించి మనిషిలో ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయని, ఆ గొప్పతనాన్ని వాళ్లు వేసుకునే దుస్తుల వైపు నుంచి చూడకండి అంటూ ఆమె ట్వీట్ చేసింది.

More Related Stories