English   

విజయ్ దేవరకొండకి మరో ఘనత ! 

Vijay-Devarakonda
2019-02-04 12:36:49

సినిమా ఇండస్ట్రీలో అనేది గ్లామర్ ప్రపంచమే అలా అని అందం ఉంటె చాలదు, దానికి అభినయం కావాలి ఈ రెండిటికీ అదృష్టం తోడవ్వాలి. అలా అయినప్పుడే మామూలు మనిషి స్టార్ అవుతాడు. రోడ్ మీద మన పక్క నుండి వెళ్తున్నా పట్టించుకోని అమ్మాయిల ఫోన్ వాల్ పేపర్ అవుతాడు. ఈ విషయంలో విజయ్ దేవరకొండ అదృష్టవంతుడనే చెప్పాలి. ముందు చిన్న క్యారెక్టర్ చేసి తర్వాత పెళ్లి చూపులు అనే సినిమాలో హీరోగా చేసి ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఇప్పటికే తెలుగులో స్టార్ హోదా అనుబవిస్తున్న విజయ్ దేవరకొండ తాజాగా విజయ్.. ఫోర్బ్స్ 30 అండర్ 30లో చోటు సంపాదించుకున్నాడు. ఇటీవలే ఫోర్బ్స్ ఇండియా తన ఆరో ఎడిషన్‌ను ప్రకటించింది. ఇండియాకు చెందిన 30 ఏళ్లలోపు వయసు ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌ను ఈ లిస్టులో ఫోర్బ్స్ ఎంపిక చేసింది. దాంట్లో తెలుగు యాక్టర్ విజయ్ దేవరకొండ చోటు సంపాదించాడు. ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మ్యూజిక్ రంగంలో విజయ్‌ని ఎంపిక చేశారు ఫోర్బ్స్ వాళ్ళు. ఈ కేటగిరీలో విజయ్‌ తో పాటు ఇండియా నుండి యూట్యూబర్ ప్రజక్తా కొలి(25), సింగర్ మేఘనా మిశ్రా(17)ను ఫోర్బ్స్ ఎంపిక చేసింది. 

More Related Stories