English   

ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడిపై జీవిత రాజశేఖర్ పోలీస్ కంప్లైంట్ !

Jeevitha
2019-02-04 13:28:26

 బంజారాహిల్స్ కి చెందిన కౌశిక్ అనే కాంగ్రెస్ నేతపై జీవిత రాజశేఖర్ ఏసీపీ కార్యాలయంలో పిర్యాదు చేయడం సంచలనం సృష్టించి. కౌశిక్ అనే వ్యక్తి కావాలని తన మరిదిపై దాడి చేశారని జీవితా రాజశేఖర్ దంపతులు ఆ ఫిర్యాదు లో పేర్కొన్నారు. జీవిత ఏసీపీ ఆఫీస్ కి వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం ఒక్కసారిగా మీడియాలో వైరల్ గా మారింది. రాజశేఖర్ బ్రదర్ గుణశేఖర్ కి గుణా డైమండ్ అనే ఒక షో రూమ్ ఉంది. అది బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45 లో ఉంది. గుణ డైమండ్స్ ముందు కౌశిక్‌రెడ్డి త‌న కారును నిలిపి వేరే ప్రాంతానికి వెళ్లాడ‌ని, ఇదేమ‌ని గుణ‌శేఖ‌ర్ ప్ర‌శ్నించినందుకు ప్రాంతం పేరుతో దూషిస్తూ ఆయ‌న‌ను తీవ్రంగా కొట్టాడని దీంతో గుణ‌శేఖ‌ర్‌కు తీవ్ర‌గాయ‌ల‌య్యాయనీ అప్పటి నుండి  ఆయ‌న ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారనీ వారి ఫిర్యాదు లో పేర్కొ న్నారు. ఈ నేప‌థ్యంలోనే డిశ్చార్జి అయిన గుణ‌శేఖ‌ర్‌ తో క‌లిసి వ‌చ్చిన జీవితా రాజ‌శేఖ‌ర్‌లు ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సీసీ ఫుటేజీల‌ను ప‌రిశీలించాల‌ని వాటిని బట్టి చర్యలు తేసుకోవలని ఆయ‌న‌ను కోరారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేయాల‌ని సూచించ‌డంతో జీవితారాజ‌శేఖ‌ర్‌, గుణ‌శేఖ‌ర్‌లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేయ‌డానికి వెళ్లారు. అయితే ఈ కౌశిక్ అనే వ్యక్తి కాంగ్రెస్ లీడర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సోదరుడ ని సమాచారం. నేడు జీవిత భర్త రాజశేఖర్ పుట్టినరోజు సందర్బంగా కొత్త సినిమా కల్కి టీజర్ ను రిలీజ్ చేశారు. ఈవెంట్ లో పాల్గొన్న జీవిత, రాజశేఖర్ అనంతరం ఎసీపీ కార్యాలయానికి వెళ్లారు.

More Related Stories