English   

పూరీ రామ్ - ఒక కాఫీ !

Puri-Jagan
2019-02-05 04:41:41

రామ్ పోతినేని - డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌ లో ఇస్మార్ట్ శంక‌ర్ అనే సినిమా తెర‌కెక్కుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ మధ్యనే ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్‌ లో ప్రారంభ‌మైంది. షూటింగ్ మొదటి షెడ్యూల్ ఫిబ్రవరి 21 వరకు జరుగనుంది. అయితే చిత్ర ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తాజాగా త‌న ట్విట్ట‌ర్‌లో హీరో రామ్ త‌న‌కి కాస్ట్‌లీ కాఫీ ప్యాక్ ని గిఫ్ట్‌గా ఇచ్చాడ‌ని, ప్ర‌స్తుతం దానిని తాను తాగుతున్న‌ట్టు తెలిపాడు. కావాలంటే మీరు గూగుల్ చేయచ్చని ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్నాడు. నిజానికి కోపి లువాక్ అనే కాఫీ ప్ర‌పంచ‌లో కెల్లా అత్యంత‌ ప్ర‌త్యేక‌మైన‌ది. దీని ధ‌ర కూడా చాలా ఎక్కువ‌. కోపి లువాక్ ఒక ప్యాక్ ధ‌ర వచ్చేసి రూ.5000కి పైమాటే అని అంటున్నారు. అందుకే కామోసు పూరి పెట్టిన పోస్ట్‌కు రామ్‌ స్పందిస్తూ .ఈ కాఫీ గురించి గూగుల్‌లో వెతక్కండి. దీని గురించి తెలిస్తే దిమాగ్‌ ఖరాబ్‌ ఐతదని ట్వీట్ చేశాడు. నిజానికి ఈ కోపీ లువాక్‌ కాఫీని చెర్రీస్‌తో తయారుచేస్తారట. దీనిని ఎక్కువగా ఇండోనేసియాలోని సుమత్రా, జావా, బాలి లాంటి ప్రాంతాల్లో పండిస్తుంటారు. ఒక్కో కప్పు కాఫీ ధర సుమారు 35 డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు ఉంటుంది. అదలా ఉంచితే ఈ సినిమాని మేలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని పూరీ భావిస్తున్నాడు. ఊర మాస్ కంటెంట్‌తో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ఈ సినిమాని తెర‌కెక్కిస్తున్న‌ట్టు స‌మాచారం.  

More Related Stories