సొంత ప్రొడక్షన్ లో మహేశ్ సినిమా !

ఈ మధ్య మహేష్ బాబు మాల్ బిజినెస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అలా ఒక పక్క సినిమాలు మరో పక్క మాల్ బిజినెస్ అంటూ తలమునకలుగా ఉన్నాడు. అలాంటి ఈయన వెబ్ సిరీస్ నిర్మాణం చేస్తున్నాడంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆయన ప్రస్తుతం తన 25వ చిత్రంగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి అనే సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వేసవి కానుకగా ఈ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ సుకుమార్‌తో కలిసి ఓ సినిమా చేయనున్నాడు. ఈ షూట్ అయిన వెంటనే ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం వరుసగా నాలుగు విజయాలు సాధించిన అనీల్ రావిపూడితో ఓ సినిమా చేయాలని మహేష్ ఫిక్స్ అయ్యాడట. ఎఫ్ 2 హిట్ తో మంచి జోష్ మీద ఉన్న అనీల్ రావిపూడి ఇటీవల మహేష్‌ని కలిసి కథ వివరించగా, దానికి ఫుల్ ఇంప్రెస్ అయిన మహేష్ తన సొంత బేనర్లోనే ఈ సినిమా చేద్దామని అన్నాడని వార్తలు వస్తున్నాయి. నిజమెంత ఉందొ తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్ కి అనీల్ సుంకర కూడా సహా నిర్మాతగా ఉంటాడని తెలుస్తుంది. అయితే ఈ విషయం మీద అధికారిక ప్రకటన రావలసి ఉంది. తన సొంత ప్రొడక్షన్ లో మహేష్ చేసిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ అయితే శ్రీమంతుడు మాత్రం సూపర్ హిట్ గా నిలిచింది.