English   

పునర్జన్మ కాన్సెప్ట్ తోనే ఆర్ఆర్ఆర్ !

RRR
2019-02-05 05:30:51

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తోన్న మల్టీ స్టారర్ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి రోజురోజుకీ ఆ సినిమా మీద వస్తున్న గాసిప్స్ ఏ సాక్ష్యం.  ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే బోలెడన్ని రూమర్లు, వార్తలు వచ్చాయి. అయితే, ఈ మధ్య కాలంలో వచ్చిన గాసిప్స్ ని బట్టి ఈ సినిమా కధా కధనం భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందు అంటే  ఉంటుందని సమాచారం. ఎన్టీఆర్ ఒక బందిపోటుగా కనిపిస్తారని, రామ్ చరణ్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో అధికారిగా ఉంటారని టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా కథపై మరో రూమర్ వినిపిస్తోంది. పూర్వకాలంలో సినిమా కథ ప్రారంభం కావడం వాస్తవమేనని అయితే, అప్పట్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ స్నేహితులుగా అదే ఇప్పటి జన్మలో అన్నదమ్ములుగా కనిపిస్తారని అంటున్నారు. అంటే, ఈ సినిమాలో మగధీర రాజమౌళి మాదిరిగా రెండు జన్మలను చూపించనున్నారన్న మాట. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ రెండు జన్మలు, రెండు కాలాల్లో ఈ ఇద్దరు హీరోలు ఎలా ఉండబోతున్నారనే ఆత్రుత ప్రేక్షకుల్లో ఉండటం ఖాయం. ఈ సినిమా కి సబందించిన షెడ్యూల్ ప్రారంభం లాంటివి తప్ప ఇంకేమీ బయటకు వెళ్ళనివవట్లేదు రాజమౌళి. ప్రస్తుతం హైదరాబాద్‌ శివారులో వేసిన ప్రత్యేక సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ రెండో షెడ్యూల్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు ఇటీవల ఖరారు అయిన సముద్రఖని కూడా పాల్గొంటున్నారని సమాచారం.  చూడాలి మరి ఈ గాసిప్ లో ఎంత నిజముందో ?

.

More Related Stories