English   

అంచనాలని అందుకోలేకపోయాం..సారీ: రామ్ చరణ్

Ram-Charan
2019-02-05 07:28:30

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వినయ విధేయ రామ సంక్రాంతి సందర్భంగా జనవరి 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమాతో చరణ్ అభిమానులకు, ప్రేక్షకులకూ ఊహించని షాక్ ఇచ్చినట్టు అయ్యింది. ఎంత అంచనాలతో రిలీజ్ అయ్యింది అంత ఆసు పాలు అయ్యింది. రోటీన్ స్టోరీ, లాజిక్స్ కి అందని యాక్షన్ సీన్లు, ఫ్యాన్స్‌ని, ఆడియన్స్‌ని ఏమాత్రం ఆకట్టుకోలేక పోయాయి. యక్షన్ సీన్స్ మీద అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ నడిచాయి. అయితే సినిమా రిలీజ్ ముందు వరకూ ప్రమోషన్స్ చేసిన యూనిట్ మొదటి ఆట మొదలయిన నుండీ గన్ షాట్ కి కూడా దొరకాలేదు హీరో సహా మిగతా యూనిట్. బోయపాటి అయితే అజ్ఞాతంలోకి వెళ్ళాడని వార్తలు కూడా వచ్చాయి. నిర్మాత మాత్రం బయ్యర్లకి డబ్బు వెనకిచ్చాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ స్పందించని రాం చరణ్ రీసెంట్‌గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసాడు. అభిమానులను, ప్రేక్షకులను ఉద్దేశించి, తన సినిమాల పట్ల వారు చూపుతున్న ఆదరణకు ధన్యవాదాలు తెలుపుతూ, వినయ విధేయ రామ సినిమా కోసం కష్టపడిన నిర్మాత దానయ్య, టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తూ, మీ అందరికీ నచ్చి, మిమ్మల్ని వినోదింపజేసే సినిమా అందించడానికి మేమంతా ఎంతగానో శ్రమించామని  దురదృష్టవశాత్తు మేము అనుకున్న విధంగా ఒక మంచి సినిమాని అందించలేక మీ అంచనాలను అందుకోలేకపోయామని  ప్రేక్షకులు చూపిస్తోన్న ఈ ఆదరణ, అభిమానాన్ని ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో అందరికీ నచ్చే సినిమాలు చేయటానికి కృషి చేస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు. 

More Related Stories