English   

రాజమండ్రి వెళ్తున్న వెంకీ మామ టీం !

Venky-Mama
2019-02-05 09:06:04

సంక్రాంతి సందర్భంగా తాజాగా విడుద‌లైన ఎఫ్‌ 2 తో సూప‌ర్ డూప‌ర్ హిట్‌ ను సాధించడంతో ఆ స‌క్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు వెంక‌టేష్‌. త్వ‌ర‌లో వెంకీమామ అనే మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించ‌నున్నాడు ఆయన. జై లవకుశ ఫేం బాబీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక‌క్క‌నున్న ఈ చిత్రంలో నిజజీవితంలో ఆయన మేనల్లుడు అయిన నాగ చైత‌న్య కూడా ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్నాడు. వెంకీ సరసన శ్రియా, చైతన్య సరసన ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌లుగా న‌టించ‌నున్నారు. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్ర‌వరి 22న సెట్స్ మీద కి వెళ్ళ‌నుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ చిత్రం దాదాపు విలేజ్ బ్యాక్ డ్రాప్‌ లో ఉంటుంద‌ని , తొలి షెడ్యూల్‌ని రాజ‌మండ్రి సమీపంలో వేసిన  సెట్లో షూట్ చేయాలనీ యూనిట్ స‌న్నాహాలు చేస్తోంది. ఈ షెడ్యూల్‌లో చిత్రానికి సంబంధించి కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఈ సినిమాని కోన వెంకట్ కి సంబందించిన కోన కార్పోరేష‌న్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ద‌గ్గుబాటి రానా కూడా ఈ చిత్రంలో కీల‌క పాత్ర పోషించ‌నున్నాడ‌ని వార్తలు వచ్చాయి. దీని మీద క్లారిటీ అయిత్గే రాలేదు కానీ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ జ‌రిపి విజ‌య ద‌శ‌మి కానుక‌గా ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. 

More Related Stories