English   

విశాల్ కోసం స్పెషల్ సాంగ్ లో సన్నీ !

Sunny-Leone
2019-02-05 16:35:02

బాలీవుడ్‌ లో శృంగారనటిగా పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్ తమిళ నటుడు విశాల్‌ తో కలిసి ఓ ప్రత్యేక గీతంలో చిందులేయబోతోంది. ప్రస్తుతం విశాల్ 'అయోగ్య' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'టెంపర్' చిత్రానికి రీమేక్. ఈ చిత్రంలో విశాల్ తో కలసి ఓ ఐటెం సాంగ్ లో సన్నీ నటించనుంది. ప్రస్తుతం సన్నిలియోన్‌ కోలీవుడ్‌లో నటిస్తున్న మరో చిత్రం ‘వీరమహాదేవి’. ఇందులో ఆమె టైటిల్‌ రోల్ లో నటిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం  చిత్రీకరణ జరుపుకొంటోంది, కానీ ఈ పాత్రలో సన్నీలియోన్‌ని అక్కడి ప్రేక్షకులు ఒప్పుకునేందుకు సిద్ధంగా లేరని కోలీవుడ్‌ చిత్రవర్గాలంటున్నాయి. సన్నీని వ్యతిరేకిస్తూ ఆందోళన చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇదిలా ఉండగా మలయాళంలో మమ్ముట్టి కథానాయకుడిగా ‘మధురరాజా’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో కూడా ఐటమ్‌ సాంగ్‌లో నర్తిస్తోందట. అయితే టెంపర్ లో ప్రకాష్ రాజ్ వేరే భామని తెచ్చి వైజాగ్ కి ఇదే సన్నీ లియోన్ అంటే తమిళ మేకర్స్ మాత్రం తమిళ తంబీలకోసం నిజమయిన సన్నీనే తెచ్చేసారు.

More Related Stories