English   

గోపీచంద్ సినిమా ఆ హిట్ కి రీమేకా ?

Gopichand to remake Salman Khan's film
2019-02-05 19:25:49

యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ ఇటీవలే ఇండియా-పాకిస్థాన్ బోర్డర్ జైసల్మేర్ లో ప్రారంభమయ్యిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా సల్మాన్ ఖాన్ చేసిన 'టైగర్ జిందా హై' సినిమాకి రీమేక్ అనే టాక్ వినిపిస్తోంది. సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా 2017 డిసెంబర్లో వచ్చిన 'టైగర్ జిందా హై' భారీ వసూళ్లను సాధించింది. ఇందులో సల్మాన్  రా ఏజంట్ గా నటించి పాక్ నేపద్య్హంలో సినిమా ఉంటుంది. అలా అది సల్మాన్ కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రాల జాబితాలో చేరిపోయింది. ఇప్పుడు ఈ సినిమానే తెలుగులో రీమేక్ చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు. సల్మాన్ పాత్రలో గోపీచంద్ కత్రినా పాత్రలో ఆమెకు జిరాక్స్ లా ఉండే జరీన్ ఖాన్ ను అనుకున్నప్పటికీ, ఆ తరువాత తమన్నాను ఎంపిక చేసుకున్నట్టుగా తెలుస్తోంది. యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ని చిత్రీకరిస్తున్నారు.. యాభై రోజు ల పాటు జరిగే ఈ షెడ్యూల్ లో రాజస్థాన్, న్యూ ఢిల్లీ వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ జరపనున్నారు. అయితే దీనికి సంబంధించి చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

More Related Stories