English   

పవన్ కళ్యాణ్ పార్టీపై పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు..

Pawan-Kalyan
2019-02-06 01:20:20

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడంతో ఇప్పుడు ఆయనకు అందరూ సలహాలు ఇస్తున్నారు. దానికితోడు జనసేన పార్టీ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు పరుచూరి గోపాలకృష్ణ కూడా ఇదే చేశాడు. పవన్ కళ్యాణ్ ను తన మాటలతో విశ్లేషించారు ఈ రచయిత. ఈ మధ్యకాలంలో పవన్ ఒక మీటింగ్లో మాట్లాడుతూ బాధ, భయం, విసుగు వేస్తున్నాయి అని చెప్పాడు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికరమైన కామెంట్ చేశాడు. పవన్ లాంటి వ్యక్తి అరుదుగా ఉంటారు అని చెప్పాడు ఆయన. దేవుడు ఆయనకు పూలబాట వేస్తే మాత్రం ముళ్లబాట ఎంచుకున్నాడని.. ప్రజల బాధల్ని తన బాధలుగా భావించి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పాడు పరుచూరి. అలాంటి పవన్ కళ్యాణ్ భయపడితే అది రాజకీయాలకు కూడా మంచిది కాదన్నారు పరుచూరి. ఎదుటి వాడి బాధ చూసి చలించిపోవడం.. తన వల్ల ఎక్కడ బాధ పడతారు అని భయపడటం కామ్రేడ్స్ లక్షణమని.. పవన్ కళ్యాణ్ లో అవి ఉన్నాయని చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ. ఇక సమాజం ఏమైపోతుందో అని భయం ఉండటం ఒక గొప్ప నాయకుడు లక్షణం అంటున్నాడు. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు విసుగు రావడం మాత్రం రాకూడదని.. దయచేసి పవన్ కళ్యాణ్ ఇంకోసారి ఆ పదాన్ని వాడకపోవడమే మంచిది అంటున్నాడు పరుచూరి గోపాలకృష్ణ. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కచ్చితంగా మార్పు తీసుకురావాలి.. కానీ విసుగు రాకూడదు అంటున్నాడు పరుచూరి. అందులోనూ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్లకు రాజకీయాలు పూర్తిగా అలవాటు అయితే విసుగు రాదు అంటున్నారు ఈయన. మొత్తానికి పవన్ కళ్యాణ్ కు బాగానే భజన చేశారు పరుచూరి గోపాలకృష్ణ.

More Related Stories