English   

రామ్ చరణ్ ఇంటి ముచ్చట్లు వింటే షాక్ అవుతారు..

Ram-Charan
2019-02-06 02:13:16

వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ అయినా కూడా రామ్ చరణ్ మాత్రం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఆయన ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్నాడు. దాంతో పాటు సొంత ఇంటి నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్నాడు మెగా వారసుడు. జూబ్లీహిల్స్ లో దాదాపు 40 కోట్లు విలువ చేసే ఇల్లు కడుతున్నాడు రామ్ చరణ్. అందులో సకల సదుపాయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. రామ్ చరణ్, ఉపాసన మాత్రమే ఇంట్లో ఉండబోతున్నారు. తమ ఇద్దరి అభిరుచికి తగ్గట్లుగా ఇంటి నిర్మాణం జరుగుతోంది. ఇందులో చాలా విశేషాలున్నాయి. ఉపాసన యానిమల్ లవర్.. అందుకే గుర్రాలు, పక్షుల కోసం ప్రత్యేకంగా ఒక షెల్టర్ నిర్మిస్తున్నారు. దాంతో పాటు భారీ స్విమ్మింగ్ పూల్, థియేటర్ అన్నీ ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు రామ్ చరణ్. గుర్రాల కోసం ప్రత్యేకంగా స్థలాన్ని కేటాయిస్తున్నాడు. ఇంటీరియర్ కూడా విదేశాల నుంచి తెప్పిస్తున్నారు మెగా వారసుడు. మొత్తానికి ఈ ఇల్లు ఇప్పుడు ఇంద్రభవనంలా రెడీ అవుతుంది. త్వరలోనే ఇంటి పనులు పూర్తి కానున్నాయి. మొత్తానికి అటు సినిమాలు ఇటు సొంత ఇంటి పనులతో బిజీగా ఉన్నాడు మెగా వారసుడు.

More Related Stories