English   

ఇంతకీ మహానాయకుడు ఎప్పుడు వస్తుంది.. శివరాత్రి కన్ఫర్మ్ చేసుకోవచ్చా..

Mahanayakudu
2019-02-06 06:52:31

బాలకృష్ణ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా విడుదల తేదీ పై ఇంకా క్లారిటీ రావడం లేదు. ఫిబ్రవరి 7న ఈ చిత్రం వస్తుందని ముందు నుంచి వార్తలు వినిపించినా కూడా ఇప్పుడు దానినుంచి పోస్ట్ పోన్ అయ్యింది. ఆ తర్వాత ఫిబ్రవరి 14 అన్నారు.. అది కూడా కుదరడం లేదు.. 22 అంటున్నారు అది కూడా రావడం కష్టంగా మారింది. దాంతో ఇప్పుడు ఫిబ్రవరి 28 మహాశివరాత్రి కానుకగా మహానాయకుడు సినిమా విడుదల కానుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర యూనిట్ మాత్రం ఎలాంటి స్పందన తెలియ చేయడం లేదు. షూటింగ్ ఎంతవరకు వచ్చింది.. సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది.. అనే విషయాలపై బాలకృష్ణ గాని క్రిష్ కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. దాంతో సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తి అభిమానుల్లో.. ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. కథానాయకుడు తీవ్రంగా నిరాశ పరచడంతో మహానాయకుడు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు దర్శకుడు క్రిష్. కచ్చితంగా ఈ సినిమాతో కథానాయకుడు బాకీ తీర్చాలని కసి మీద ఉన్నాడు ఈ దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిపోయింది. ఈ మధ్య ధర్నా సన్నివేశాలు చిత్రీకరించాడు దర్శకుడు క్రిష్. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కథానాయకుడు ఫ్లాప్ కావడంతో ఇందులో కాస్త మసాలా ఎక్కువగానే దట్టించారు దర్శక నిర్మాతలు. కచ్చితంగా మహానాయకుడు ప్రేక్షకులకు నచ్చుతుందని ధీమాతో కనిపిస్తున్నాడు బాలకృష్ణ. అయితే విడుదల తేదీని మాత్రం ఇప్పటికీ ఇంకా ప్రకటించలేదు.

More Related Stories