English   

సమంత బొమ్మ చూసి కలెక్షన్లు వస్తాయా.. సీమ రాజా పరిస్థితి ఏంటి..

Samantha
2019-02-06 07:11:45

కొన్నిసార్లు తమిళ సినిమాలకు తెలుగులో మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి.. దానికి కారణం ఇక్కడ నటీనటులు నటించడమే. ఇప్పుడు శివ కార్తికేయన్ నటించిన సీమ రాజా సినిమా కూడా ఇలాగే విడుదలవుతుంది. ఈయనకు తెలుగులో అసలు మార్కెట్ లేదు. రెమోతో పాటు మరో రెండు మూడు సినిమాలు తెలుగులో డబ్ చేసినా కూడా ప్రేక్షకులు అసలు పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పుడు సీమ రాజా సినిమాలో సమంత హీరోయిన్ గా నటించడంతో ఆమె ఇమేజ్ ఇక్కడ ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ట్రైలర్ లో కూడా ఎక్కువగా సమంతను ఫోకస్ చేశారు. ఆమె కర్రసాము చేయడం అభిమానులను ఆకట్టుకుంటోంది. దానికి తోడు సిమ్రాన్ కూడా ఉండటంతో సీమ రాజ ట్రైలర్ లో బాగానే ఆకట్టుకుంటుంది. అయితే సినిమాలో సమంత కంటే సిమ్రాన్ ముఖ్యమైన పాత్ర చేసింది. మీరందరూ పంచ కట్టిన ఆడవాళ్ళతో సమానం.. నేను చీరకట్టిన మగాడిని అంటూ సిమ్రాన్ చెప్పిన డైలాగులు బాగానే ట్రైలర్ లో పేలుతున్నాయి. దానికితోడు సమంత గ్లామర్ కూడా సినిమాకు హెల్ప్ కానుంది. ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి సమంత, సిమ్రాన్ ఇమేజ్ సీమరాజాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.

More Related Stories