English   

రణ్‌ వీర్ సింగ్ అతి చేష్టలు....అభిమానులకి గాయాలు !

Ranveer-Singh
2019-02-06 07:37:15

బాలీవుడ్ హీరో రణ్‌ వీర్ సింగ్ గురించి తెలుసు కదా. ఈ ఎనర్జిటిక్ హీరో ఎక్కడి కెళ్లినా తన అతి చేష్టలతో వార్తల్లో నిలుస్తాడు. అలా రణ్ వీర్ సింగ్ మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. అందాల భామ దీపికా పదుకొనేతో పెళ్లి తర్వాత కూడా రణ్‌వీర్‌లో ఏ మార్పూ రాలేదు సరికదా మరింత ఎనర్జటిక్ గా తయారయ్యాడు రణ్‌ వీర్‌. తాజాగా లాక్మె ఫ్యాషన్ వీక్‌లో భాగంగా రణ్‌వీర్ ఊహించని పని చేశాడు. ఈవెంట్ లో భాగంగా సినిమాలోని అప్నా టైమ్ ఆయేగా అనే పాట పాడుతూ సడెన్‌గా స్టేజ్ కింద ఉన్న ఫ్యాన్స్‌పైకి దూకాడు. ఈ పరిణామాన్ని ఊహించని అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. సడెన్‌గా అభిమానులపైకి దూకడంతో కొంతమంది కింద పడి గాయాల పాలయ్యారు. మరికొందరు అతన్ని తమ మొబైల్ ఫోన్లలో బంధించే పనిలో బిజీగా ఉన్నారు. ఆ అభిమానుల్లో యువకుల కంటే ఎక్కువగా యువతులే గాయపడ్డారు. అలా యువతులు కిందపడిన ఫొటోలను కొన్ని వార్తా పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించాయి. రణ్‌వీర్ చర్యను కొందరు అభిమానులు ఖండించారు. 

More Related Stories