English   

అజయ్ భూపతి మల్టీ స్టారర్ !

Ajay-Bhupathi
2019-02-06 08:07:46

‘ఆర్‌ఎక్స్‌ 100’ విజయం తర్వాత చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ దర్శకుడు అజయ్‌ భూపతి పేరు విపరీతంగా వినిపించింది. ఆయన నితిన్ తో సినిమా చేస్తారంటూ జోరుగా వార్తలు వినిపించాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం అజయ్‌ భూపతి బెల్లంకొండ శ్రీనివాస్ ను ఖరారు చేశారని తెలిసింది. మహాసముద్రం టైటిల్‌తో అజయ్‌ భూపతి ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఇదొక మల్టీస్టారర్‌ సినిమా అని ఇందులో ఓ కథానాయకుడిగా నటించేందుకు బెల్లకొండ సాయి శ్రీనివాస్‌ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో శ్రీనివాస్ కు జోడీగా హీరోయిన్ గా సమంతాను తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారట. అయితే సమంతా కూడా సినిమాకు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి సినిమా 'అల్లుడు శీను' లో సమంతానే హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో మరోసారి అల్లుడు శీను జోడీ రిపీట్ అవుతుందన్నమాట. సమంతా ఎంట్రీతో ఈ సినిమా మరింత క్రేజీగా మారుతోంది అయితే ఈ సినిమాలో మరో జోడీ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.  

More Related Stories