English   

బోయపాటి దెబ్బకి పాఠం నేర్చుకున్న చరణ్...అందుకే కొరటాలకి !

Ram-Charan
2019-02-06 08:45:26

టాలీవుడ్‌ లో ఈరోజు సినిమాలని బట్టి చూస్తే వంద శాతం సక్సెస్ రేటు ఉన్న దర్శకుల జాబితాలో మొదటి ప్లేస్ లో ఉన్నారు దర్శకుడు కొరటాల శివ. ఆయనతో సినిమా తీస్తే హిట్టే అన్న నమ్మకం మన హీరోలకి ఏర్పడింది. కొరటాల ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించే 152వ సినిమాకు స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నాడు. చిరంజీవి ‘సైరా’ సినిమా పూర్తి అయిన వెంటనే కొరటాల సినిమా మొదలు కానుంది అయితే ఈ సినిమాకు సంబంధించి కొరటాల శివ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న చరణ్ ఈ దర్శకుడికి ఇప్పటికే 2 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారట. అలాగే కొన్ని ఏరియాల హక్కులను పారితోషికంగా అందజేస్తామని కోరతాలకు మాటిచ్చారట. నిజానికి తనకున్న క్రేజ్ ని బట్టి ఒక్కో సినిమాకు కొరటాల 10 కోట్ల నుంచి 15 కోట్ల మేర పారితోషికం తీసుకుంటారని బయట ప్రచారం ఉంది. అంటే 2 కోట్లు ఇప్పుడు తీసుకున్నా మిగతా మొత్తం ఏరియా హక్కుల రూపంలో అతనికి అందనున్నాయట. నిజానికి  ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ మిక్కిలినేని సుధాక‌ర్ కోరతాలకు అత్యంత ఆప్తుడు. తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న కష్టాల్లో తనకు ఎంతగానో సాయపడిన స్నేహితుడు కం పంపిణీదారుడు సుధాకర్ మిక్కిలినేని కోసం అన్ని కమిట్ మెంట్లను పక్కనబెట్టి సినిమా చేయబోతున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ చిరు సినిమా ఓకే అవ్వడంతో ఆ సినిమా పక్కన పెటాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఏరియా హక్కులు తన స్నేహితుడికి ఇవ్వాలని కొరటాల భావిస్తున్నారట. ఏరియా హక్కులు అంటే దర్శకుడిని అదుపులో పెట్టినట్టే. బోయపాటి దెబ్బకు విలవిల్లాడిన చరణ్ తెలివిగా ఆలోచించి ఈ పని చేసాడని అంటున్నారు.

More Related Stories