English   

బుల్లితెర నటి ఆత్మహత్య !

Naga-Jhansi
2019-02-06 16:16:57

వర్దమాన బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకుని మరణించింది. హైదరాబాద్‌ లోని శ్రీనగర్‌కాలనీలో తన నివాసంలో ఆమె మంగళవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మాటీవీలో ప్రసారమయ్యే పవిత్రబంధం సీరియల్ ద్వారా పాపులర్ అయిన ఝాన్సీ ఆత్మహత్యకి ప్రేమ వ్యవహరమే కారణమని ప్రాధమిక అంచనా. సూర్య అలియాస్ నాని అనే వ్యక్తితో పరిచయం అయిన తర్వాత ఝాన్సీ సీరియల్స్ మానేసిందని ఆమె కుటుంబసభ్యులు చేబుతున్నారు. అయితే వివాహం చేసుకోమంటే అతడు ముఖం చాటేశాడని దీంతో సూర్య తనను మోసం చేశాడని తీవ్ర మనస్తాపానికి గురైన ఝాన్సీ ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. నిన్న రాత్రి తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకున్న ఝాన్సీని, ఆఫీసు నుంచి వచ్చిన ఆమె సోదరుడు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, అప్పటికే ఆమె మృతిచెందినట్టు నిర్ధరించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. అలాగే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్య కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఆవకాశాలు తగ్గిపోవడంతో పాటు సూర్యతో ప్రేమ వ్యవహారంలో విఫలమవడమే ఆత్మహత్యకు కారణమని పోలీసులు అంచనాకు వచ్చారు. నిన్న ఉదయం కూడా ఆమెకు సూర్యతో గొడవ జరిగినట్టు చెబుతున్నారు. కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని కడలి గ్రామానికి చెందిన ఝాన్సీ, సినిమాల్లో అవకాశాలు వెదుక్కొంటూ హైదరాబాద్‌ కు వచ్చింది. పవిత్రబంధం సీరియల్‌తోపాటు మరో రెండు సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేసిన  ఆమె, తన తల్లి, సోదరుడితో కలిసి శ్రీనగర్‌కాలనీలో నివాసం ఉంటోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.

More Related Stories