English   

బన్నీకి జంటగా రష్మిక !

Rashmika-Mandanna
2019-02-06 11:00:00

 
'ఛలో' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రష్మిక రెండో చిత్రంగా వచ్చిన 'గీత గోవిందం'తో ఓవర్ నైట్‌స్టార్ అయిపోయింది. ఆ సినిమాలో తన నటనతో కుర్రకారు గుండెల్లో గూడు కట్టేసుకుంది. గీత గోవిందం ఇచ్చిన సక్సెస్‌ తో కిక్ మీద ఉన్న ఈ కన్నడ భామ తెలుగులో వరసపెట్టి అవకాశాలు దక్కించుకుంటోంది ప్రస్తుతం ఆమె దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుండగా త్వరలో త్రివిక్రం, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి. ముందుగా ఈ సినిమాలో కియరా అద్వానిని తీసుకోవాలని చూశారనీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ అయ్యేలా లేవని ఇప్పుడు రష్మికను అప్రోచ్ అయ్యారని ఫిలిం నగర్ వర్గాల సమాచారం. గతంలో బన్నీ హీరోగా నటించిన నా పేరు సూర్యలో కథానాయికగా రష్మిక పేరు గట్టిగ వినిపించింది. అయితే ఎందుకో అది వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోనైనా బన్నీకి జోడీగా రష్మిక నటిస్తుందో లేదంటే వార్తలకే పరిమితమవుతుందో చూడాలి మరి. బన్నీ రౌడీ అంటూ గొడవ చేశారంటే యాసిడ్ పోసేస్తానని హెచ్చరించిన ఈ భామ ఏమి చేస్తుందో ?

More Related Stories