English   

ఊరమాస్ లుక్ లోకి మారిన శ్రీ విష్ణు !

Sree-Vishnu
2019-02-06 18:37:48

రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్సపై ‘శ్రీ ఓం సినిమా’ సమర్పణలో కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందుతున్న తిప్పరా మీసం సినిమా గతేడాది ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఒకడుండేవాడు, నీదీ నాదీ ఒకే కథ, మెంటల్‌ మదిలో లాంటి డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినిమాలు చేస్తూ వస్తోన్న ఈ యువ హీరో అసుర సినిమా ఫేం కృష్ణ విజయ్ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ ఈరోజు చేసారు మేకర్స్. టైటిల్‌కు తగ్గట్టుగా గుబురు గడ్డంతో మాస్‌ లుక్‌ లోకి ఒదిగిపోయాడు  శ్రీవిష్ణు. నిజానికి కృష్ణ విజయ్ నారా రోహిత్ శ్రీ విష్ణు ముగ్గురూ మంచి మిత్రులు. నారా రోహిత్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన ప్రొడక్షన్ హౌస్ ఆరన్ ఫిలిమ్స్ ని చూసుకునేది శ్రీ విష్ణు భార్య ప్రశాంతి, కృష్ణ విజయ్ లే. అసుర సినిమా తర్వాత తర్వాత దర్శకుడిగా చాలా గ్యాప్ తీసుకున్న కృష్ణవిజయ్ ఇప్పుడు బయటకు వెళ్ళకుండా శ్రీవిష్ణునే మాస్ గెటప్ లోకి మార్చి సినిమా తీస్తున్నాడు. చూడాలి మరి ఈ మిత్రుల ప్రయోగం ఏమేరకు ఫలితం ఇస్తుందో ?

More Related Stories