English   

పంజాబ్ మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్....ఏమంటాడో ?

Mahesh
2019-02-06 12:06:16

టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరయిన మహేష్ బాబు సినిమాలు యూట్యూబ్ తదితరాల కోసం ఇతర భాషల్లో డబ్ అవుతుంటాయి. ముఖ్యంగా తమిళ్, హిందీలో మహేష్ సినిమాలు ఎక్కువగా డబ్ అవుతున్నాయి. అయితే గత కొంతకాలంగా మహేష్ బాబు సినిమాలు హిందీ బాషలోనే పంజాబ్ లో కూడా రిలీజ్ అవుతున్నాయి. మహేష్ గత చిత్రం భరత్ అనే నేను పంజాబ్ లో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పంజాబ్ లో కూడా విజయాన్ని నమోదు చేయడంతో పంజాబీలు సైతం సిమహేష్ పై అభిమానం పెంచుకున్నారు. దీంతో ఇక నుండి మహేష్ నటించిన సినిమాలు పంజాబీ భాషలో కూడా డబ్బింగ్ చేయాలని మహేష్ అభిమానులు పంజాబ్ నుండి సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్లు చేస్తున్నారు. హిందీ అయితే కొంతవరకే అని అదే పంజాబీ భాషలో డబ్బింగ్ చేసిన సినిమా అయితే పంజాబ్ రాష్ట్రంలో ఎక్కువ థియేటర్స్ లో ప్రదర్శించే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు. ఇప్పుడు రానున్న మహేష్ తాజా చిత్రం మహర్షిని తమ కోసం కూడా అనువదించి విడుదల చేయవలసిందిగా పంజాబ్ మహేష్ అభిమానులు సోషల్ మీడియాలో మహేష్ బాబుకి ట్వీట్ చేస్తున్నారు. అదీ కాక ఈ సినిమాలో నార్త్ వాళ్ళకు ఇదివరకే పరిచయమైన పూజా హెగ్డే కూడా ఉండడంతో మహర్షిని ఇక్కడ తప్పకుండా ఆదరిస్తారని వాళ్ళ లాజిక్. నిజానికి డబ్బింగ్ చెప్పించడం అంటే పెద్దగా రిస్క్ ఉండద. మరి మహేష్ తన అభిమానుల కోసం ఈ పని చేస్తాడో లేదో ? మరి చూద్దాం.

More Related Stories