English   

మేనమామ మాట కోసం సినిమా చేస్తున్న ధరమ్ తేజ్ !

Sai-Dharam-Tej
2019-02-06 12:47:06

పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రాకముందు నిర్మాత ఏఎం రత్నంతో సినిమా చేసేందుకు అంగీకరించాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ సినిమా కెరియర్ లో ఖుషీ ఒక సంచలనం. ఆ తరువాత ఆ సినిమా నిర్మాత రత్నంకు పవన్ కు మధ్య సాన్నిహిత్యం బాగా పెరిగింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఆతరువాత కొన్ని సినిమాలు వచ్చినా ఆసినిమాలు అన్నీ ఫ్లాప్ అయ్యాయి. అయితే వరసపెట్టి వచ్చిన పరాజయాలతో ఆర్ధిక సమస్యల మధ్య ఇరుక్కున్న రత్నంను ఆదుకుంటానని పవన్ మాట ఇవ్వడంతో పాటు కాటమరాయుడు షూట్ లో రత్నం - పవన్ కాంబినేషన్ తో ఒక సినిమాను ప్రకటించారు. అయితే పవన్ మీద ఉన్న నమ్మకంతో దర్శకుడు ఎస్.జె.సూర్యతో పవన్ కల్యాణ్ లేకుండానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ పవన్ రాజకీయాల్లో బిజీగా అవ్వడంతో ఈ సినిమా చెయ్యలేకపోయాడు. కానీ సినిమా ఒప్పుకున్నపుడే ఆ నిర్మాత దగ్గర పవన్ కొంత అడ్వాన్స్ తీసుకుంటున్నారట. కానీ సినిమా చెయ్యలేకపోతున్నందున ఆ సినిమా బదులు తన మేనల్లుడు సాయి ధరం తేజ్ తో సినిమా చెయ్యమని నిర్మాతకు పవన్ కల్యాణ్ సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. మరి పవన్ కల్యాణ్ స్థానంలో సాయి ధరం వచ్చాడు కానీ ఈ సినిమాకు దర్శకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. సాయి ప్రస్తుతం కిషోర్ తిరుమల చిత్రలహరి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు, ఈ సినిమా తరువాత ఏ.ఎమ్.రత్నం సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

More Related Stories