English   

టెంపర్ ని దింపారు...అయోగ్య టీజర్ !

vishal raashi khanna starrer ayogya tamil teaser released
2019-02-06 14:23:06

పూరీ జగన్నాథ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కిన టెంపర్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమా మిగతా భాషల్లోనూ టెంపర్ చూపిస్తోంది, ఇటీవల హిందీలో ‘సింబా’ పేరుతో విడుదల చేసిన ఈ మూవీని తమిళ్‌లో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేశారు. విశాల్ హీరోగా నటించిన ఈ మూవీ తమిళ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో విశాల్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ ఈ సినిమా దర్శకత్వం వహించారు.

 

పార్థిపన్, డైరెక్టర్ కే.యస్ రవి కుమార్‌ లు ఈ సినిమాలో  ముఖ్యపాత్రలు పోషించారు. తాజాగా విడుదలైన టీజర్‌ ని చూస్తే ఎన్టీఆర్ టెంపర్‌ సినిమాని దాదాపు దింపేసే ప్రయత్నం చేశారని అర్ధం అవుతోంది. తమిళ్ నేటివిటీ తగ్గట్టుగా కాస్త మార్పులు చేర్పులు చేసినట్టు కనిపిస్తున్నప్పటికీ టెంపర్ సీన్లనే దాదాపు దింపేశారు. అయితే పూరీ పంచ్ లకి ఎన్టీఆర్ హైవోల్టేజ్ యాక్షన్ పర్ఫెక్ట్ గా సూట్ అయ్యింది కానీ | అదే పాత్రను విశాల్ చేస్తుంటే కాస్త అతి చేస్తున్నట్టుగా ఉంది. చూడాలి తెలుగు టెంపర్‌ని తమిళ తంబీలు ఎలా రిసీవ్ చేసుకుంటారో.  ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.  మరి రిలీజ్ తరువాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తోందో చూడాలి.

More Related Stories