English   

‘లవర్స్ డే’ టీజర్ : ప్రియా వారియర్ లిప్ లాక్ చూశారా !

Priya-Prakash-Varrier
2019-02-07 11:16:16

కన్నుగీటి కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిన మలయాళీ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్ ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. కేరళలోని త్రిసూర్ లో ఇంటర్ చదువుకునే అమ్మాయి ఒక్క కన్ను గీటుకి స్టార్ అయిపొయింది. ఆమె క్రేజ్ ఎంతలా పెరిగింది అంటే ఆ సినిమా తెలుగు, హిందీ, తమిళ బాషలలో కూడా విడుదల చేస్తున్నారు. ఆ ఒరు ఆధార్ లవ్ సినిమాను తెలుగులో లవర్స్ డే పేరుతో విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రయూనిట్ టీజర్ రిలీజ్ చేసింది. ఈ టీజర్ లో హీరో రోషన్, హీరోయిన్ ప్రియా వారియర్‌ని లిప్‌కిస్ చేయటం యూత్ ఆడియన్స్‌ని బాగా ఆకర్షిస్తోంది. టీజర్‌ ని బట్టి చూస్తే ఈ సినిమా యూత్‌ని బాగా ఎంటర్‌టైన్ చేయటం ఖాయంగా కనిపిస్తుంది. లవర్ డే రొమాంటిక్ టీజర్‌ అంటూ విడుదల చేసిన ఈ టీజర్ పేరుకు తగ్గట్టే రొమాన్స్‌తో కూడిన మసాలాని బాగానే దట్టించి వదిలిపెట్టారు. ఇందులో ప్రియా వారియర్ ఎర్రటి పెదవులను లిప్ లాక్ చేశాడు హీరో. ఇక ముద్దు రుచి చూసిన ప్రియా వారియర్ ఆ మత్తులో మునుగిపోవడాన్ని టీజర్‌లో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు బాగానే వైరల్ అవుతుంది. ఒమర్ లులు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పలు బాషలలో ఒకే సారి ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More Related Stories