English   

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నాగేశ్వరరావు బయోపిక్ !

Bellamkonda-Sai
2019-02-07 05:02:31

తెలుగులో బయోపిక్ ల జోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రాజకీయ నాయకులూ, క్రీడాకారులు, స్వాతంత్ర్య సమరయోధులు మొదలయిన వారి సినిమాలు తెరకెక్కించిన నేపధ్యం 'టైగర్ నాగేశ్వర రావు' బయోపిక్ కూడా తెరకెక్కనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇండియన్ రాబిన్‌హుడ్‌గా పేరుమోసిన టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తెరకెక్కుతున్నట్లు టైగర్ నాగేశ్వరరావు పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో రాజ్ తరుణ్ తో కిట్టు వున్నాడు జాగ్రత్త సినిమా చేసిన దర్శకుడు వంశీకృష్ణ ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ముందుగా ఆ సినిమా రానాతో అనుకున్నప్పటికీ ఆ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో ఆ సినిమా ఆగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా మొదలవనుందనేది తాజా సమాచారం. అయితే ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమాకి నిర్మాత అనిల్ సుంకర కాదు అభిషేక్ అగర్వాల్ అని తెలుస్తోంది.  మరి ఈయన అయిన సినిమా మొదలుపెడతాడో లేదో చూడాలి మరి.

More Related Stories