English   

నటిని దారుణంగా చంపిన అసిస్టంట్ డైరెక్టర్ భర్త !

director
2019-02-07 12:14:44

సినిమా ఇండస్ట్రీలో ఆత్మహత్యలే ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి, అలాంటిది ఇండస్ట్రీకే చెందిన భర్త చేతిలో ఒక తమిళ నటి దారుణహత్యకు గురైన ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. నటిని హత్యచేసి, ముక్కలుగా నరికిన అసిస్టంట్ డైరెక్టర్ వాటిని వేర్వేరు ప్రదేశాల్లో పడేసిన ఘటన సంచలనంగా మారింది. చెన్నై నగర శివారులో జరిగిన ఈ ఘటన జరిగిన రెండు వారాల తర్వాత నిందితుడు పోలీసులకు చిక్కాడు. అందుతున్న సమాచారం ప్రకారం జనవరి 21న పళ్లికరనైయ్ డంపింగ్ యార్డ్‌లో గుర్తుతెలియని ఓ మహిళకు చెందిన కాళ్లు, చేయి బయటపడ్డాయి. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఎవరనేది గుర్తించడానికి పోలీసులు విశ్వప్రయత్నాలు చేయగా, చివరికి తూత్తుకూడికి చెందిన సంధ్యవిగా గుర్తించారు. సినిమాల్లో నటిస్తోన్న సంధ్య ఆచూకీ గత కొద్ది రోజులుగా కనపడక పోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆమె భర్త, సినీ సహాయ దర్శకుడు బాలకృష్ణన్‌ను అదుపులోకి అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే దీనికి కారణంగా ఆమె భర్త పెర్కొన్నారట. రాత్రివేళలో సంధ్య గంటల తరబడి మొబైల్‌లో మాట్లాడుతుండడం, తరుచూ బయటకు వెళ్తుండడంతో ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని బాలకృష్ణకి అనుమానం పెరిగి ఇద్దరి మధ్య వివాదాలు  చోటుచేసుకోవడంతో మొదలయిన ఈ గొడవ హత్యతో ముగిసింది. డంపింగ్ యార్డ్‌లో చెత్తను జేసీబీతో లోడింగ్ చేస్తుండగా కాళ్లు, చేతులను గుర్తించిన చెన్నై కార్పొరేషన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందజేశారు. చేతులపై శివుడు-పార్వతి ట్యాటూ గుర్తించారు. దాని ద్వారా చివరకు మృతురాలిని నటి సంధ్యగా తేల్చిన పోలీసులు ఆమె భర్తను తమదైన శైలిలో విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
 

More Related Stories