English   

చెక్ పోస్ట్ దగ్గర రచ్చ రేపిన చరణ్ !

Ram-Charan
2019-02-07 05:26:15

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ ల క్రేజీ కాంబినేషన్ లో ఆర్ఆర్ఆర్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మొదటి షెడ్యూల్ ఇటీవలే పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండవ షెడ్యూల్ షూటింగ్ మొదలైంది. అయితే ఈ సినిమా మీద రోజుకొక గాసిప్ కూడా వస్తోంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న షూట్ లో చరణ్ తదితరులపై ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ఇక్కడ చిత్రీకరిస్తున్నట్టుగా సమాచారం. సినిమా షూట్ మొదలయినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా చరణ్, తారక్ ఇద్దరూ కలిసే షూటింగ్‌లో పాల్గొంటూ వచ్చారు. అయితే ఇప్పుడు తారక్‌ కు బ్రేకిచ్చి చరణ్‌తో భారీ ఫైట్స్ చేయిస్తున్నారట రాజమౌళి. రామ్ చరణ్ తో పోలీస్ చెక్ పోస్ట్ దగ్గర భారీ ఫైట్ సీన్ షూట్ చేశారట, ఈ ఫైట్ సీన్ లో చరణ్ వందల మంది మధ్య మైండ్ స్టంట్స్ తో కేక పుట్టించాడట. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా ఒక పోలీస్ చెక్ పోస్ట్ సెట్ వేశారని తెలిసింది. ఆ స్పెషల్ సెట్‌ లోనే ఈ ఫైట్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్లు,  ఇతర నటీనటులు ఎవరు అనే విషయాలలో గోప్యం పాటిస్తున్నారు.  

More Related Stories