English   

బాలయ్యకు జోడీగా రకుల్ ? 

Rakul
2019-02-07 12:47:08

రకుల్ ప్రీతీ సింగ్ గతంలో టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది. అయితే వరుసగా ఈమెకి ఫ్లాప్స్ రావటంతో తెలుగు లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పటి వరకు తెలుగు లో సైన్ చేసిన సినిమా ఒక్కటంటే ఒక్కటి లేదు. అయితే లేటెస్ట్ గా బాలయ్య సినిమా లో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న బోయపాటి సినిమాలో రకుల్ ను దాదాపు హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్టేనని అంటున్నారు. బాలయ్య తాజాగా నటించిన ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాలో ఓ చిన్న వేషం వేసింది రకుల్ ప్రీత్. అందులో శ్రీదేవి పాత్రలో ఆమె మెరిసింది. పాటతో పాటు ఓ చిన్న సీన్ లో కూడా ఆమె నటించింది. బాలయ్యతో రెండో సినిమా అయినా బోయపాటితో మాత్రం ఆమెకి మూడవ సినిమా. ఇంతకుముందు జయజానకి నాయక, సరైనోడు సినిమాలకు వీళ్లిద్దరూ కలిసి వర్క్ చేశారు. అందుకే తన నెక్ట్స్ మూవీలో కూడా రకుల్ కే ఛాన్స్ ఇచ్చాడు బోయపాటి. త్వరలోనే బోయపాటి-బాలయ్య ప్రాజెక్టుపై అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోందని అంటున్నారు. 

More Related Stories