English   

రాజమౌళి గారు.. ఆ ఒక్క విషయం చెప్పండి బాసు..

Rajamouli
2019-02-07 07:35:05

రాజమౌళి సస్పెన్స్ థ్రిల్లర్ చేయడు.. కానీ బయట మాత్రం ఆయన చాలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు తన సినిమా విషయంలో కూడా ఇదే చేస్తున్నారు దర్శకధీరుడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మొదలుపెట్టి కూడా నాలుగు నెలలు దాటిపోయింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసుకుని రామోజీ ఫిలిం సిటీలో ఇప్పుడు RFCలో రెండో షెడ్యూల్ జరుపుకుంటోంది ఈ చిత్రం. ఇన్ని రోజుల తర్వాత కూడా ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారనే విషయంపై మాత్రం నోరు విప్పడం లేదు. అడిగితే కాలమే సమాధానం చెబుతుంది అన్నట్టు చూస్తున్నాడు.. కానీ ఆయన నోటి నుంచి మాత్రం ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం పరిణీతి చోప్రాతో పాటు అలియాభట్ కూడా రాజమౌళి సినిమాలో నటించబోతుందని ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ కానీ దర్శకుడు రాజమౌళి గానీ ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు రాసుకున్నా కూడా ఆయన మాత్రం తన సినిమాకు పబ్లిసిటీ వస్తుంది కదా అన్నట్లు ఊరుకున్నాడు. ఇక కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఎవరు ఎవరికి జోడీగా నటిస్తారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ప్రియమణి కూడా ఈ క్రేజీ మల్టీస్టారర్ లో నటించబోతోంది. మొత్తానికి హీరోయిన్ల విషయంలో చాలా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు దర్శకధీరుడు. దీనిపై సమాధానం ఎప్పటికీ చెబుతాడనేది నిజంగానే కాలమే నిర్ణయిస్తుంది.

More Related Stories